For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యూహాం మార్చిన మాంసం వ్యాపారులు! రెండింతలు పెరిగిన ఆర్డర్లు

|

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అత్యవసర వస్తువుల దుకాణాలు మినహా అన్ని మూతబడ్డాయి. కరోనా కారణంగా ఇటీవల చికెన్, గుడ్లపై కూడా ప్రభావం పడింది. చికెన్ వ్యాపారులు, చేపల వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఆన్ లైన్ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆన్‍‌లైన్ ఆర్డర్లు భారీగా పెరిగాయట.

Covid 19: కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్Covid 19: కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్

మాంసం విక్రయాలు

మాంసం విక్రయాలు

అత్యల్ప మాంసం తలసరి వినియోగ దేశాల్లో భారత్ ఉంది. 2013లో ప్రపంచ సగటు 33.2 కిలోలు ఉండగా మన దేశంలో మాత్రం 5.6 కిలోలుగా ఉంది. ఈ పరిశ్రమ అంచనా ప్రకారం ప్రతి ఏడాది 40 బిలియన్ డాలర్ల వ్యాల్యూతో 20 శాతం వృద్ధి సాధిస్తోంది. బెంగళూరుకు చెందిన నందూస్ చికెన్ సొంత హ్యాచరీస్, ఫీడ్ మిల్స్, బ్రీడర్ ఫామ్స్, ప్రాసెసింగ్ సెంటర్లు,, కోల్డ్ చైన్లు ఉన్నాయి. కరోనా కారణంగా ఇది తన 49 స్టోర్లలో 26 స్టోర్స్‌ను మూసివేసింది.

ఐనా డబుల్ ఆర్డర్స్

ఐనా డబుల్ ఆర్డర్స్

నందుస్ చికెన్ సగానికి పైగా స్టోర్స్‌ను క్లోజ్ చేసినప్పటికీ ఆర్డర్లు మాత్రం పెరిగాయట. తమ స్టోర్స్ కొన్నింటిని మూసివేసినప్పటికీ తమ ఆర్డర్ల వృద్ధి దాదాపు రెట్టింపు అయిందని నందూస్ ఫౌండర్, చీఫ్ ఎఘ్జిక్యూటివ్ ఆపీసర్ నరేంద్ర పశుపతి చెప్పారు.

వర్చువల్ కమాండ్ సెంటర్

వర్చువల్ కమాండ్ సెంటర్

నందూస్ చికెన్ కిలో రూ.250 వరకు విక్రయిస్తుంది. దీనిని బిర్యానీ, చికెన్ కర్రీ వంటి వాటికి ఉపయోగిస్తారు. అలాగే, చికెన్ పాప్‌కార్న్, చికెన్ బర్గర్, చికెన్ నగ్గెట్స్ వంటి వాటికి కూడా ఉపయోగిస్తారు. నందు చికెన్‌లో 110 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తాజా పరిస్థితుల్లో ఇది 17 మంది టీమ్‌తో వర్చువల్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

15వేల డెలివరీలు

15వేల డెలివరీలు

తమ వద్ద పని చేసే ఉద్యోగుల్లో చాలామందికి తామే వసతి కల్పిస్తున్నామని, దీంతో తమ వద్ద పని చేసే ఉద్యోగులను ప్రత్యేకంగా రమ్మని చెప్పవలసిన అవసరం లేదని, ఆర్డర్ వచ్చినప్పుడు డెలివరీ సులభమైందని పశుపతి చెప్పారు. ఈ సంస్థ వారానికి 15,000 డెలివరీలు చేస్తోంది. సొంత డెలివరీలతో పాటు జొమాటో, స్విగ్గీ, డుంజో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా కూడా బిజినెస్ ఉంటోంది. లాక్‌డౌన్‌కు ముందు సరాసరిన నెలకు 40,000 ఆర్డర్లు వచ్చేవని, ఇప్పుడు నెలకు 65,000 వరకు ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.

భారీగా పెరిగిన డిమాండ్

భారీగా పెరిగిన డిమాండ్

ఏడు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న మీట్ ప్రొడ్యూసర్ లిసియస్ కోఫౌండర్ వివేక్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ నెలలో ఈ-ఫండింగ్ సిరీస్ ద్వారా 30 మిలియన్ డాలర్లు సమీకరించామని, తమ సంస్థ 700 మంది ఉద్యోగులతో సేవలు అందిస్తోందని చెప్పారు. లాక్ డౌన్‌కు ముందు తమ వ్యాపారం వారానికి 40 శాతం పెరుగుదల నమోదు చేసిందని, ప్రస్తుతం 200 శాతం వృద్ధిని చూస్తున్నామని చెప్పారు.

రోజు 18వేల ఆర్డర్లు

రోజు 18వేల ఆర్డర్లు

ఎక్కువగా సేల్ అవుతున్న వాటిలో చికెన్, చేపలు ఉన్నాయని వివేక్ చెప్పారు. ఇటీవలి కాలంలో కొత్త కస్టమర్లు భారీగా పెరిగారని తెలిపారు. ప్రతిరోజు 18,000 ఆర్డర్లు ప్రాసెస్ చేస్తోందన్నారు.

రోజుకు 1500 కాల్స్

రోజుకు 1500 కాల్స్

ముంబై కేంద్రంగా పని చేసే పెస్కా ఫ్రెష్ ఫౌండర్ సంగ్రమ్ సావంత్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ తర్వాత ఆన్ లైన్ అమ్మకాలు భారీగా పెరిగాయని చెప్పారు. గత కొద్ది రోజులుగా ఆన్ లైన్ సేల్స్ రెట్టింపు అయ్యాయని చెప్పారు. ప్రతి రోజు 1500 కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే జాలర్లు తమ తమ ఇళ్లకు వెళ్లిపోవడంతో చేపల రావడం తగ్గిందన్నారు.

పరిస్థితులు పరిశీలిస్తున్నాం

పరిస్థితులు పరిశీలిస్తున్నాం

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికి అప్పుడు పరిశీలిస్తున్నామని వివేక్ గుప్త అన్నారు. అవసరమైన మార్గదర్శకాలు పాటిస్తున్నామన్నారు. భద్రతా నిబంధనలు పాటించేందుకు ప్రభుత్వం, స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నామన్నారు. కానీ బ్యాకెండ్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మ్యాన్ పవర్, లాజిస్టిక్స్ పరంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు.

English summary

వ్యూహాం మార్చిన మాంసం వ్యాపారులు! రెండింతలు పెరిగిన ఆర్డర్లు | Meat retailers switch to online, see sales double during lockdown

Retailers of chicken and fish are witnessing an unprecedented spike in sales after switching to online models that lead to more orders.
Story first published: Sunday, April 19, 2020, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X