For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెంట్రల్ బ్యాంకు కొత్త MD & CEOగా తెలుగు వ్యక్తి

|

ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD & CEOగా మటం వెంకట రావు నియమితులయ్యారు. ఆయన తెలుగు వ్యక్తి. సోమవారం బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంకు ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. మూడేళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఆయన ఉంటారని రెగ్యులేటరీ సంస్థలకు బ్యాంకు తెలిపింది.

జూలై 3, 1965లో జన్మించిన వెంకటరావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనంలో కీలకపాత్ర పోషించారు. కెనరా బ్యాంకులో మూడేళ్ల పాటు ఈడీగా విధులు నిర్వర్తించారు. 1988లో అలహాబాద్ బ్యాంకులో అగ్రికల్చరర్ ఫిల్డ్ అధికారిగా కెరీర్‌ను ప్రారంభించారు.

Matam Venkata Rao appointed MD & CEO of Central Bank

మార్చి 1, 2021 నుండి ఆయన కెనరా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతల నుండి వైదొలుగుతున్నట్లు కెనరా బ్యాంకు కూడా తెలిపింది. గత ఏడాది మే నెలలో బ్యాంక్ బోర్డ్ బ్యూరో వెంకటరావును సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీ, సీఈవోగా రికమండ్ చేసింది.

English summary

సెంట్రల్ బ్యాంకు కొత్త MD & CEOగా తెలుగు వ్యక్తి | Matam Venkata Rao appointed MD & CEO of Central Bank

Public sector lender Canara Bank on Monday said its Executive Director Matam Venkata Rao has been appointed as the new MD & CEO of Central Bank of India.
Story first published: Tuesday, March 2, 2021, 7:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X