For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారుతీ సుజుకీ కీలక నిర్ణయం: ప్లాంట్ క్లోజ్, కరోనా చికిత్స కోసం ఆక్సిజన్

|

దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తయారీ యూనిట్లను క్లోజ్ చేసింది. వాహనాల తయారీకి బదులు ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ అవసరాల కోసం తమ ఆక్సిజన్‌ను వినియోగించాలని నిర్ణయించింది. మారుతీ సుజుకీ హర్యానాలోని తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్‌ను క్లోజ్ చేసి, ఆ స్థానంలోని ఆక్సిజన్‌ను వినియోగిస్తామని స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో తెలిపింది.

సాధారణంగా నిర్వహణ కార్యకలాపాల నిమిత్తం ప్రతి సంవత్సరం 2సార్లు మారుతీ ఫ్యాక్టరీలను కొద్దిరోజుల పాటు మూసివేస్తుంది. ఈ క్రమంలో జూన్ నెలలో మూసివేయాల్సిన ఫ్యాక్టరీలను ఇప్పుడు కాస్త ముందుగా క్లోజ్ చేస్తున్నారు. మే 1వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు హర్యానాలోని మారుతీ ఫ్యాక్టరీలను మూసి ఉంచనున్నారు. తద్వారా తమ ఉద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వలను ఆసుపత్రులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని భావించారు.

Maruti Suzuki Shuts Down Plants To Make Oxygen For Medical Needs

ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ వంతుగా సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ సుజుకీ పేర్కొంది. గుజరాత్‌లోని సుజుకీ మోటార్స్ ఇండియా కూడా ఇదే నిర్ణయం తీసుకుందని మారుతీ తన ప్రకటనలో వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి 24 గంటలకు లక్షల కేసులు నమోదవుతున్నాయి.

English summary

మారుతీ సుజుకీ కీలక నిర్ణయం: ప్లాంట్ క్లోజ్, కరోనా చికిత్స కోసం ఆక్సిజన్ | Maruti Suzuki Shuts Down Plants To Make Oxygen For Medical Needs

Maruti Suzuki, the country's largest car maker, will shut down its manufacturing units in Haryana to make oxygen gas available for medical needs, the company said in a stock exchange filing. Suzuki Motor has also decided to shut down its manufacturing unit in Gujarat, Maruti Suzuki added.
Story first published: Wednesday, April 28, 2021, 21:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X