For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెడ్ లైన్ దగ్గరపడుతోంది... నిల్వలు మాత్రం భారీగా ఉన్నాయి? ఏం జరుగుతుందో ఏమో?

|

దేనికి సంభందించిన గదువైనా దగ్గర పడుతోందంటే హడావుడి, ఆందోళన తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఉండ కూడదనుకుంటే ముందునుంచే అప్రమత్తంగా ఉండాలి. అన్ని సక్రమంగా చూసుకోవాలి. లేకపోతే గడువు తర్వాతి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు దేశీయ ఆటో మొబైల్ కంపెనీలు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాయి.

1% వడ్డీ తగ్గింది.. కానీ PPF రుణం తీసుకోవచ్చా? కారణాలు ఇవే1% వడ్డీ తగ్గింది.. కానీ PPF రుణం తీసుకోవచ్చా? కారణాలు ఇవే

మార్చి చివరి దాకా గడువు

మార్చి చివరి దాకా గడువు

భారత్ స్టేజ్ (బీఎస్)- 4 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే మార్చి చివరి దాకా మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉండదు. ఇందుకు అనుగుణంగానే కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. బీఎస్-4 వాహనాల ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. అయినప్పటికీ ఈ వాహనాల నిల్వలు డీలర్ల వద్ద ఎక్కువగానే ఉన్నాయని సమాచారం. ఇందుకు కారణం అమ్మకాలు తగ్గడమే. వరుసగా రెండో నెల అయినా జనవరి లోను అమ్మకాలు క్షీణించాయి. జనవరిలో టూ వీలర్ల అమ్మకాలు 8.8 శాతం, వాణిజ్య వాహనాల అమ్మకాలు 6.9 శాతం మేర క్షీణించాయి. ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు కూడా 4.4 శాతం తగ్గాయి. ఈ నేపథ్యంలో డీలర్ల వద్ద జనవరి చివరి నాటికీ టూ వీలర్లు, వాణిజ్య వాహనాల సగటు నిల్వలు 25-30 రోజుల కు సరిపడే స్థాయిలో ఉన్నట్టు ఫెడరేషన్ అఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియెషన్ (ఫాడా) వద్ద ఉన్న సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్యాసెంజర్ వాహనాల విషయంలో ఇది 15-20 రోజుల స్థాయిలో ఉంది. వీటిలో అధిక శాతం వాహనాలు బీఎస్-4 వాహనాలకు సంబంధించినవే.

సందిగ్ధంలో కొనుగోలుదారులు...

సందిగ్ధంలో కొనుగోలుదారులు...

వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా సందిగ్ధంలో ఉన్నారు. బీఎస్-4 వాహనాలు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ విషయంలో ఒకవేళ ఇబ్బంది ఎదురైతే అది ఉపయోగ లేకుండా పోతుందని భావిస్తున్నారు. బీఎస్-4, బీఎస్-6 వాహన ధరల్లో తేడా ఉంటుంది. అందుకే బీఎస్-4 వాహనం కొనాలా లేదా బీఎస్-6 వాహనం కోసం వేచి చూడాలా అన్నదాని పై కొంత మంది కస్టమర్లతో స్పష్టత లేదు.

డిస్కౌంట్ల కోసం ఎదురుచూపు

డిస్కౌంట్ల కోసం ఎదురుచూపు

కొంత మంది వాహన కొనుగోలుదారులు మార్చి నెల చివర్లో కంపెనీలు తమ వద్ద ఉన్న వాహనాల నిల్వలను తగ్గించుకోవడానికి డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉంటుందని ఎదురుచూస్తున్నారు. నిర్దేశిత గడువు తర్వాత బీఎస్ - 4 వాహనాలు ఎందుకు పనికిరావు. కాబట్టి వాటిని ఎలాగైనా విక్రయించుకోవాలని డీలర్లు భారవిస్తుంటారు. ఇదిలా ఉంటే ప్యాసెంజర్, కమర్షియల్ వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టినా త్రీవీలర్లు, ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం జనవరిలో మెరుగ్గానే ఉన్నాయి.

English summary

డెడ్ లైన్ దగ్గరపడుతోంది... నిల్వలు మాత్రం భారీగా ఉన్నాయి? ఏం జరుగుతుందో ఏమో? | March end is the deadline for auto companies to sell BS IV vehicles

Automobile companies sales are declined for a second consecutive month in January. with this vehicle inventory is increased at dealers level. The companies are reduced their BS-IV vehicle production to match with the March deadline. From April 1st only BS-VI vehicles will be registered.
Story first published: Saturday, February 22, 2020, 14:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X