For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New Year 2023: జనవరి 1, 2023 నుంచి ఏం మార్పులు రాబోతున్నాయంటే..

|

శనివారంతో 2022 సంవత్సరం ముగియనుంది. ఆదివారం నుంచి నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరలంలో సామాన్యుల జీవనంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపే అంశాలు, పెరగబోయే ధరలు గురించి తెలుసుకుందాం.

పెరగనున్న వాహనాల ధరలు

పెరగనున్న వాహనాల ధరలు

జనవరి 2023 నుంచి పలు కంపెనీల వాహనాల ధరలు పెరగనున్నాయి. మారుతీ, కియా, టాటా మోటార్స్, మెర్సిడెస్, హ్యుందాయ్, ఆడి, రెనాల్ట్, MG మోటార్స్ వంటి దాదాపు దేశంలోని ప్రతి ప్రధాన కార్ల తయారీ సంస్థలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

బంగారం

బంగారం

వచ్చే సంవత్సరం బంగారం ధరలు పెరిగే అకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023లో 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంపు

పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంపు

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఎన్‌ఎస్‌సి (ఎన్‌ఎస్‌సి), నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ల వడ్డీ రేట్లు పెరిగాయి. 20 నుంచి 110 బేసిస్ పాయింట్లు పెరగనున్నాయి. దీనితో పాటు కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. పెరిగిన వడ్డీ రేట్లు జనవరి1, 2023 నుంచి అమలులోకి రానున్నాయి.

 లాకర్ నియమాలు

లాకర్ నియమాలు

జనవరి1, 2023 నుంచి లాకర్ రూల్స్‌లో కూడా మార్పులు రానున్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత లాకర్‌లో ఉంచిన వస్తువులు పోగొట్టుకుంటే బ్యాంకుదే బాధ్యత. లాకర్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, బ్యాంకు ఖాతాదారులకు తెలియజేయాలి.

NPS

NPS

మీరు ఎన్‌పిఎస్ ఖాతాదారు అయితే, వచ్చే ఏడాది మీ ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేయలేరు. ఇప్పుడు జనవరి 1, 2023 నుంచి, రాష్ట్ర ఉద్యోగులు లేదా కేంద్ర ఉద్యోగులు NPS ఖాతా నుండి విత్‌డ్రా చేసుకోలేరు. కరోనా మహమ్మారి దృష్ట్యా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఆన్‌లైన్‌లో ఉపసంహరణ సదుపాయాన్ని కల్పించింది.

GST ఎలక్ట్రానిక్ బిల్లు

GST ఎలక్ట్రానిక్ బిల్లు

జనవరి 1, 2023 నుంచి GST నియమాలలో మార్పు రాబోతోంది. ఇప్పుడు 5 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం చేసే వ్యాపారులకు ఇ-ఇన్‌వాయిస్ అంటే ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరి చేయనున్నారు. ఇంతకుముందు ఈ పరిమితి రూ.20 కోట్లు కాగా, ఇప్పుడు రూ.5 కోట్లకు తగ్గించారు.

English summary

New Year 2023: జనవరి 1, 2023 నుంచి ఏం మార్పులు రాబోతున్నాయంటే.. | Many changes are going to come from next year.. They are

The year 2022 will end on Saturday. New Year will start from Sunday. Let's know about the factors that will have a direct and indirect impact on the lives of common people and the prices that will increase in the new years.
Story first published: Saturday, December 31, 2022, 12:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X