For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mahindra XUV700: న్యూ అవతార్: కళ్లు చెదిరే లుక్..అద్దిరిపోయే ఫీచర్స్: గ్రాండ్ రివీల్

|

చెన్నై: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV700) మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దిసేపటి కిందటే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యాజమాన్యం.. ఈ లగ్జరీ కారును ఆవిష్కరించింది. ఒకేసారి ఏడుమంది ప్రయాణించడానికి వీలుగా దీన్ని రూపొందించిందా టాప్ ఆటొమొబైల్ కంపెనీ. దేశీయ, విదేశీ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఈ ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీ కారును డిజైన్ చేసింది. ఈ కారు ధరపై మాత్రం సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది. రేట్ ఎంత అనేది ఇంకా రివీల్ చేయలేదు.

ప్రయాణికులకు శుభవార్త: లండన్‌కు ఎయిరిండియా ఫ్లైట్స్: షెడ్యూల్ ఇలాప్రయాణికులకు శుభవార్త: లండన్‌కు ఎయిరిండియా ఫ్లైట్స్: షెడ్యూల్ ఇలా

 స్పెసిఫికేషన్స్ ఇవే..

స్పెసిఫికేషన్స్ ఇవే..

ఈ ఎస్‌యూవీ రేంజ్ ఎక్స్‌యూవీ 700 కారులో ఆసక్తికరమైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 10.25 ఇంచుల డిస్‌ప్లే దీని సొంతం. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటిదాకా ఈ స్థాయి డిస్‌ప్లే లేదని మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యం చెబుతోంది. కారుతో పాటు కొత్త లోగోను కూడా ఆవిష్కరించింది. వెహికల్ క్యాబిన్ టెంపరేచర్‌ను మనం ఇంట్లో నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. డీజిల్, పెట్రలో వేరియంట్లలో లభిస్తుందీ మోడల్. అలాగే- వేర్వేరుగా సెవెన్ సీటర్, ఫైవ్ సీటర్‌ రేంజ్‌లో లభిస్తుంది

గేర్.. ఆటోమేటిక్..

గేర్.. ఆటోమేటిక్..

ఈ మధ్యకాలంలో దాదాపు కార్ల తయారీ కంపెనీలన్నీ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతోన్న విషయం తెలిసిందే. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా దీనికి మినహాయింపు కాదు. ఇదివరకే కొన్ని వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లో విడుదల చేసింది. తాజాగా ఆవిష్కరించిన ఎక్స్‌యూవీ 700ను కూడా ఆటోమేటిక్ గేర్ సిస్టమ్‌లోనే రూపొందించింది. మ్యానువల్ గేర్‌లో కూడా ఈ వేరియంట్లు లభిస్తాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

ఆ కార్లకు గట్టి పోటీ..

ఆ కార్లకు గట్టి పోటీ..

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 సెవెన్ సీటర్ కావడం వల్ల కుటుంబ సభ్యులు మొత్తం ప్రయాణించడానికి వీలు ఉంటుంది. మోరిస్ గ్యారెజెస్ (ఎంజీ) హెక్టార్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ వంటి ఎస్‌యువిలతో మహీంద్రా అండ్ మహీంద్రా పోటీపడనుంది. ఈ కార్లన్నీ సెవెన్ సీటర్లే కావడం వల్ల.. అదే కేటగిరీలో గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700ను డిజైన్ చేసిందనేది ఆటోమొబైల్ సెక్టార్ విశ్లేషకుల అభిప్రాయం.

ధరపై సస్పెన్స్

ధరపై సస్పెన్స్

దీని ధరను దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌లో ప్రకటించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. అన్ అఫిషియల్‌గా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ కారు ధర 14 లక్షల నుంచి 18 లక్షల రూపాయలకు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మహీంద్రా కంపెనీకే చెందిన ఎక్స్‌యూవీ 500తో పోలిస్తే ఇది అప్‌డేట్ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో 700 మార్కెట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

లోగో కూడా..

లోగో కూడా..

ఇక మహీంద్రా అండ్ మహీంద్రా లోగో కూడా మారబోతోంది. బ్రాండ్ న్యూ లోగోను రూపొందించింది కంపెనీ యాజమాన్యం. ఈ ఎక్స్‌యూవీ 700 కారుతోనే కొత్త లోగో కూడా సాక్షాత్కరిస్తుంది. కొత్త లోగోతో రాబోతోన్న తొలి కారు కూడా ఇదే. ఈ మధ్యకాలంలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు కార్లను తీర్చిదిద్దుతోన్న విషయం తెలిసిందే. కనీసం ఏడుమంది వరకు ప్రయాణించేలా కొత్త కార్లను డిజైన్ చేస్తోన్నాయి. వాటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి.

డబుల్ ఇంజిన్..

డబుల్ ఇంజిన్..

ఎక్స్‌యూవీ 500‌ను అప్‌డేట్ చేస్తూ.. దాన్ని సెవెన్ సీటర్‌గా మార్చింది కంపెనీ యాజమాన్యం. 500 తరహాలోనే ఎక్స్‌యూవీ 700లో కూడా యాంగ్యుల‌ర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, వెర్టిక‌ల్ క్రోం హైలైట్స్‌తో స్క్వారిష్ గ్రిల్ వంటి ఫీచ‌ర్లతో వచ్చింది. ఈ ఎక్స్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. 2.0-లీటర్ 200 బీహెచ్‌పీ ఎంస్టాలిన్ పెట్రోల్ ఇంజిన్ ఎక్స్‌యూవీ 700 ప్రత్యేకత. అలాగే- డీజిల్ వేరియంట్‌లో 2.0-లీటర్ 185 బీహెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఎంహాక్‌ డీజిల్ ఇంజిన్‌లో లభిస్తుంది.

English summary

Mahindra XUV700: న్యూ అవతార్: కళ్లు చెదిరే లుక్..అద్దిరిపోయే ఫీచర్స్: గ్రాండ్ రివీల్ | Mahindra XUV700 finally revealed with segment-first features, new logo, check details here

The new SUV from Mahindra XUV700 seven seater has finally been unveiled at Chennai. The XUV700 is also the first Mahindra SUV that will sport the new logo that Twin Peak.
Story first published: Saturday, August 14, 2021, 18:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X