For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mahindra XUV 700: క్లాసికల్ సెవెన్ సీటర్..ఫ్యామిలీ ప్యాక్: లాంచింగ్ టైమ్ ఇదే

|

చెన్నై: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందే.. అంటే ఈ సాయంత్రమే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యాజమాన్యం.. ఈ వెహికల్‌ను లాంచ్ చేయనుంది. దేశీయ, విదేశీ మార్కెట్‌లో ఈ లగ్జరీ కారును లాంచ్ చేయడం ఇదే తొలిసారి. వరల్డ్ వైడ్‌గా ఈ కారుకు మంచి డిమాండ్ లభించిందని, ఆశించిన స్థాయిలో ఆర్డర్లు అందుతున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

ధర అన్ అఫిషియల్..

ధర అన్ అఫిషియల్..

ఈ కారును ధర మాత్రం ఇప్పట్లో వెలువడకపోవచ్చు. దీని ధరను దేవీ శరన్నవ రాత్రుల సందర్భంగా అక్టోబర్‌లో ప్రకటించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. అన్ అఫిషియల్‌గా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ కారు ధర 14 లక్షల నుంచి 18 లక్షల రూపాయలకు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మహీంద్రా కంపెనీకే చెందిన ఎక్స్‌యూవీ 500తో పోలిస్తే ఇది అప్‌డేట్ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో 700 మార్కెట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

 లోగో కూడా..

లోగో కూడా..

ఇక మహీంద్రా అండ్ మహీంద్రా లోగో కూడా మారబోతోంది. బ్రాండ్ న్యూ లోగోను రూపొందించింది కంపెనీ యాజమాన్యం. ఈ ఎక్స్‌యూవీ 700 కారుతోనే కొత్త లోగో కూడా సాక్షాత్కరిస్తుంది. కొత్త లోగోతో రాబోతోన్న తొలి కారు కూడా ఇదే. ఈ మధ్యకాలంలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు కార్లను తీర్చిదిద్దుతోన్న విషయం తెలిసిందే. కనీసం ఏడుమంది వరకు ప్రయాణించేలా కొత్త కార్లను డిజైన్ చేస్తోన్నాయి. వాటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి.

 వాటికి పోటీ..

వాటికి పోటీ..

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కూడా ఈ కేటగిరీకి చెందినదే. సెవెన్ సీటర్ కావడం వల్ల కుటుంబ సభ్యులు మొత్తం ప్రయాణించడానికి వీలు ఉంటుంది. మోరిస్ గ్యారెజెస్ (ఎంజీ) హెక్టార్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ వంటి ఎస్‌యువిలతో మహీంద్రా అండ్ మహీంద్రా పోటీపడనుంది. ఈ కార్లన్నీ సెవెన్ సీటర్లే కావడం వల్ల.. అదే కేటగిరీలో గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700ను డిజైన్ చేసిందనేది ఆటోమొబైల్ సెక్టార్ విశ్లేషకుల అభిప్రాయం.

అప్‌గ్రేడ్ వెర్షన్..

ఎక్స్‌యూవీ 500‌ను అప్‌డేట్ చేస్తూ.. దాన్ని సెవెన్ సీటర్‌గా మార్చింది కంపెనీ యాజమాన్యం. 500 తరహాలోనే ఎక్స్‌యూవీ 700లో కూడా యాంగ్యుల‌ర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, వెర్టిక‌ల్ క్రోం హైలైట్స్‌తో స్క్వారిష్ గ్రిల్ వంటి ఫీచ‌ర్లతో రానుంది. ఈ ఎక్స్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. 2.0-లీటర్ 200 బీహెచ్‌పీ ఎంస్టాలిన్ పెట్రోల్ ఇంజిన్ ఎక్స్‌యూవీ 700 ప్రత్యేకత. అలాగే- డీజిల్ వేరియంట్‌లో 2.0-లీటర్ 185 బీహెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఎంహాక్‌ డీజిల్ ఇంజిన్‌లో లభిస్తుంది.

సాయంత్రమే గ్రాండ్ లాంచ్..

సన్‌రూఫ్ అండ్ విండోస్ కంట్రోలింగ్ ప్యానెల్స్, యూఎస్‌బీ, బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఈ ఎక్స్‌యూవీ 700‌ను మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యాజమాన్యం ఆవిష్కరించనుంది. చెన్నైలో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించబోతోంది. ఆ వెంటనే ఆర్డర్లను అందుకుంటామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ధరను మాత్రం వచ్చే అక్టోబర్‌లో వెల్లడిస్తామని స్పష్టం చేస్తోన్నారు. మోరిస్ గ్యారెజెస్ (ఎంజీ) హెక్టార్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ వంటి ఎస్‌యూవీలకు అనుగుణంగా ధర ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

English summary

Mahindra XUV 700: క్లాసికల్ సెవెన్ సీటర్..ఫ్యామిలీ ప్యాక్: లాంచింగ్ టైమ్ ఇదే | Mahindra XUV 700: 7-seater to be launched today and check the time here

Top Automobile company Mahindra's latest XUV 700 is all set to make it global debut today. Mahindra and Mahindra will launch its latest SUV at an event in Chennai.
Story first published: Saturday, August 14, 2021, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X