ఇయర్ ఎండ్ డిస్కౌంట్: మహీంద్రా బంపరాఫర్, రూ.3 లక్షలకు పైగా డిస్కౌంట్!
మహీంద్రా&మహీంద్రా కొనుగోలుదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. 2020 ఏడాది ముగియనున్న నేపథ్యంలో ఇటీవల ఆఫర్లు, డిస్కౌంట్ ప్రకటించింది. వివిధ కార్లపై ఏకంగా రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. డిసెంబర్ నెల చివరి వరకు మాత్రమే ఈ రాయితీలు ఉంటాయి. దాదాపు అన్ని రకాల మోడల్స్ పైన కొత్త కారు కొనుగోలు చేయాలనే వారికి మహీంద్రా శుభవార్త చెప్పింది.
టాటా మోటార్స్ ఖర్చులు తగ్గించుకునే వ్యూహం, ఉద్యోగులకు 3వసారి ఆఫర్

థార్‌పై నో ఆఫర్, నెలాఖరు వరకే
ఇటీవల థార్‌ను విడుదల చేసింది మహీంద్ర. ఈ థార్ మినహా మిగతా అన్ని మోడల్స్ పైన ఆఫర్స్ అందిస్తోంది. నగదు రాయితీ, ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్ వంటి వివిధ రూపాల్లో కూడా ఈ ప్రయోజనాలు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆయా నగరాలు, ప్రాంతాల ఆధారంగా కూడా డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఇలా రూ.3.06 లక్షల వరకు తగ్గింపు
బీఎస్ 6 వాహనాలపై ఏకంగా రూ.3.06 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. మహీంద్రా అల్తూరస్ జీ4 పై నగదు రాయితీ గరిష్ఠంగా రూ.2.2 లక్షల వరకు ఉంది రూ.50 వేల వరకు ఎక్సేంజ్ బోనస్, రూ.16వేల వరకు యాక్సెసరీస్ ఇస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ మరో రూ.20వేల వరకు ఉంది. ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.28.73-31.73 లక్షల మధ్య ఉంది. ఈ ఆఫర్లతో ఈ కారు కొనుగోలుదారులకు రూ.3.06 లక్షల వరకు తగ్గుతుంది.

ఇతర కార్లపై..
మహీంద్రా XUV500పై క్యాష్ ఆఫర్ రూ.12,200, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20,000, కార్పోరేట్ ఆఫర్ ఉన్నాయి. XUV 300పై రూ.25,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. మహీంద్రా KUV100 NXTపై రూ.62,000కు పైన, స్కార్పియోపై రూ.30,000కు పైన, స్కార్పియోపై రూ.30,600, బొలెరోపై రూ.20,550 వరకు బెనిఫిట్స్ అందనున్నాయి.