For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓలా, ఉబెర్‌లకు ఆనంద్ మహీంద్రా కంపెనీ సవాల్! భిన్నంగా క్యాబ్ సేవల్లోకి M&M

|

ఆటో మ్యానుఫ్యాక్చరర్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్‌లకు పోటీని ఇవ్వనుంది! ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని M&M క్యాబ్ సర్వీసులను ప్రారంభించనుంది. రాబోయే రెండు మూడేళ్లలో ప్రధానంగా కార్పోరేట్ల కోసం అలైట్ (Alyte)తో క్యాబ్ అగ్రిగేటర్‌ను ప్రారంభించనుంది.

కరోనావైరస్ దెబ్బ: భారీగా తగ్గిన బాస్మతీ రైస్ ధరలుకరోనావైరస్ దెబ్బ: భారీగా తగ్గిన బాస్మతీ రైస్ ధరలు

ఓలా, ఉబెర్‌లకు గట్టి పోటీగా..

ఓలా, ఉబెర్‌లకు గట్టి పోటీగా..

రెండు మూడేళ్లలో అలైట్ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది. క్యాబ్ సేవల్లో ఓలా, ఉబెర్ ముందున్నాయి. వీటికి M&M గట్టి పోటీ ఇవ్వనుంది. క్యాబ్ సర్వీస్ నిర్ణయంతో పాటు తన మొబిలిటీ వ్యాపారాలను ఏకం చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

అలైట్ పేరుతో యాప్

అలైట్ పేరుతో యాప్

అలైట్ (ప్రస్తుతం మహీంద్రా లాజిస్టిక్స్), M&M షేర్లు మెజార్టీగా ఉన్న మేరూ క్యాబ్స్, గ్లైడ్ (M&M ఈ-వెహికిల్ క్యాబ్ సర్వీసెస్), ఫస్ట్ ఛాయిస్ యూజ్డ్ కార్ల బిజినెస్.. ఇలా అన్ని మొబిలిటీ సర్వీసులను అలైట్ గొడుకు కిందకు తీసుకు రానుంది. ఇందుకు అలైట్ పేరుతో ఓ యాప్ తీసుకు రానుంది.

ఉద్యోగులకు.. సమావేశాలకు..

ఉద్యోగులకు.. సమావేశాలకు..

ఈ క్వార్టర్ నుండి దేశవ్యాప్తంగా తమ బ్రాండ్‌ను పరిచయం చేయనున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్ సీఈవో రామ్‌ప్రవీణ్ స్వామినాథన్ అన్నారు. వివిధ సంస్థలతో ఒప్పంద ప్రాతిపదికన ఇది పని చేస్తుందన్నారు. వివిధ సంస్థలతో ఒప్పంద ప్రాతిపదికన ఇది పని చేస్తుందని తెలిపారు. ప్రాథమికంగా కంపెనీ నుండి ఉద్యోగులను ఆఫీసుల నుండి ఇంటికి, ఇంటి నుండి ఆఫీసులకు లేదా వివిధ కాన్ఫరెన్స్, సమావేశాలకు, విమానాశ్రయాలకు తీసుకు వెళ్లే సేవలు ఉంటాయి. క్రమంగా ఈ సేవలను కాల్ ఆన్ సేవలుగా విస్తరించనుంది.

B to B సేవలు..

B to B సేవలు..

ఓలా క్యాబ్స్ కార్పొరేట్ ఫీచర్ ద్వారా కార్పొరేట్ టాక్సీ సేవలు అందిస్తోంది. ఉబెర్ ఫర్ బిజినెస్ ఫీచర్ ద్వారా ఉబెర్ క్యాబ్స్ కూడా ఈ విభాగంలోకి అడుగు పెట్టింది. ఓలా, ఉబెర్ B to C సేవలతో పోలిస్తే కార్పొరేట్ భాగస్వామ్యాలతో B to B సేవలతో అలైట్ భిన్నంగా ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.

English summary

ఓలా, ఉబెర్‌లకు ఆనంద్ మహీంద్రా కంపెనీ సవాల్! భిన్నంగా క్యాబ్ సేవల్లోకి M&M | M & M to compete with Ola, Uber with launch of cab aggregator service

Auto manufacturer Mahindra & Mahindra plans to enter the shared mobility services segment with the launch of a cab aggregator, called Alyte, for corporates.
Story first published: Monday, March 2, 2020, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X