For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రాక్టర్ సేల్స్‌లో మహీంద్రా సరికొత్త రికార్డ్, సోనాలికా 72% జూమ్

|

కరోనా మహమ్మారి నుండి ఆటో రంగం క్రమంగా కోలుకుంటోంది. మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్ సేల్స్ గత ఏడాది జూలై సమీపానికి చేరుకున్నాయి. ఈ కరోనా పీరియడ్‌లో ఆటోరంగంలో భారీగా పెరిగిన సేల్స్‌లో ట్రాక్టర్లు ముందంజలో ఉన్నాయి. దిగ్గజ ట్రాక్టర్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 27 శాతం పెరిగి 25,402గా ఉండగా, సోనాలికా 8,219 ట్రాక్టర్లను విక్రయించింది. ఇది 72 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

చైనా సహా ఆ దేశాలకు ఇండియా షాక్, కలర్ టీవీల దిగుమతులపై కఠిన ఆంక్షలుచైనా సహా ఆ దేశాలకు ఇండియా షాక్, కలర్ టీవీల దిగుమతులపై కఠిన ఆంక్షలు

మహీంద్రా ట్రాక్టర్స్ అదుర్స్

మహీంద్రా ట్రాక్టర్స్ అదుర్స్

మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు 27 శాతం పెరిగి 25,402 వాహనాలుగా నమోదయ్యాయి. 2019 జూలైలో 19,992గా ఉన్నాయి. మహీంద్రా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల కంటే ఎక్కువగా ట్రాక్టర్లను విక్రయించింది. వరుసగా మూడో నెల ట్రాక్టర్ సేల్స్ జోరుమీద ఉన్నాయి. అయితే మహీంద్రా ఆటో డివిజన్.. పాసింజర్, కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం పడిపోయాయి. మహీంద్రా 2020 జూలైలో 25,678 ట్రక్స్, బస్సులు, ఎస్‌యూవీలు విక్రయించింది. కానీ ట్రాక్టర్ సేల్స్‌లో ఈ కంపెనీకి ఇప్పటి వరకు ఇదే గరిష్టం.

సోనాలికా 72 శాతం జూమ్

సోనాలికా 72 శాతం జూమ్

సోనాలికా ట్రాక్టర్ సేల్స్ కూడా జూలైలో 72 శాతం ఎగిసి 8,219 యూనిట్లు విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 4,788 ట్రాక్టర్లు అమ్మింది. ఎగుమతులు సహరా హోషియాపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ట్రాక్టర్లు 10,223 యూనిట్లు విక్రయించింది. మే నెలలో ట్రాక్టర్ సేల్స్‌లో 25 శాతం వృద్ధి, జూన్ మాసంలో 55 శాతం వృద్ధి, జూలై నెలలో 72 శాతం వృద్ధి కనిపించిందని సోనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమన్ మిట్టల్ అన్నారు. ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ కూడా 9.9 శాతం ఎగిశాయి.

అందుకే ట్రాక్టర్ సేల్స్ పెరిగాయి

అందుకే ట్రాక్టర్ సేల్స్ పెరిగాయి

దేశవ్యాప్తంగా మెరుగైన వర్షపాతం, ఊపందుకున్న వ్యవసాయం ప్రభుత్వ పథకాలతో రైతుల చేతుల్లోకి నగదు కొంత నగదు వచ్చి చేరడంతో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకున్నాయని చెబుతున్నారు. ట్రాక్టర్ విక్రయాలు భారీగా పెరగడంతో పాటు మారుతీ సుజుకీ, హీరో మోటా కార్ప్ వంటి వాహన విభాగాలు పుంజుకున్నాయి. అయితే ఇతర మరికొన్ని సంస్థల సేల్స్ అంతగా రికవరీ కాలేదు.

English summary

ట్రాక్టర్ సేల్స్‌లో మహీంద్రా సరికొత్త రికార్డ్, సోనాలికా 72% జూమ్ | M&M July tractor sales up 27 percent, Sonalika sells 8,219 unites

Tractors, as expected, were the outlier. Mahindra and Mahindra Ltd. sold more tractors than sports utility vehicles for a third straight month, but the company's auto division—comprising passenger and commercial vehicles—made up lost ground.
Story first published: Sunday, August 2, 2020, 11:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X