LPG Price Hike: గ్యాస్ షాక్, రూ.105 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ కస్టమర్లకు మాత్రం ఊరట. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు షాకిచ్చాయి. దేశీయ చమురురంగ సంస్థలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీన తాజా ధరలను విడుదల చేసింది. దేశరాజధాని న్యూఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.105, కోల్‌కతాలో రూ.108 పెరిగింది. 5 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 పెరిగింది.
అయితే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగా ఉంది. ఇది మాత్రం భారీ ఊరట. ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.899.5, కమర్షియల్ సిలిండర్ ధర రూ.105 పెరగడంతో రూ.2012గా ఉంది. దేశ రాజధానిలోనే 5 కిలోల సిలిండర్ ధర రూ.569కి చేరుకుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఫిబ్రవరి నెలలో భారీగా తగ్గాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పెరిగాయి. గత నెలలో రూ.91.50 తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.105 పెరిగింది.

పెంపు అనంతరం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.105 రూ.1907 నుండి రూ.2012కు, కోల్‌కలో రూ.108 పెరిగి రూ.2095కు, ముంబైలో రూ.1963కు, చెన్నైలో రూ.2145కు పెరిగింది. ప్రస్తుతం (ఢిల్లీ) కమర్షియల్ సిలిండర్ ధర రెండో గరిష్టం. 2012-13లో సిలిండర్ ధర ఓ సమయంలో రూ.2200కు చేరుకుంది.