For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధరలు పెరిగినప్పటికీ, ఎల్పీజీ సిలిండర్ల వినియోగం భారీగా పెరిగింది

|

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగం 7.3 శాతం మేర పెరిగినట్లు చమురు రంగ కంపెనీలు వెల్లడించాయి. ఓ వైపు ధరలు పెరిగినప్పటికీ, మరోవైపు గ్యాస్ సిలిండర్ వినియోగం మాత్రం పెరిగినట్లు వెల్లడించాయి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (PMUY) కస్టమర్ల వినియోగం ఏకంగా 23.2 శాతం పెరిగినట్లు వెల్లడించాయి. గ‌త ఏడాదితో పోలిస్తే మొత్తం దేశీయ ఎల్పీజీ అమ్మ‌కాలు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఫిబ్ర‌వ‌రి 21 వ‌ర‌కు 10.3 శాతం వృద్ధిని న‌మోదు చేశాయ‌ని IOCL తెలిపింది.

ఎల్పీజీ ధ‌ర‌లు ఇటీవ‌ల బాగా పెరిగిన‌ప్ప‌టికీ, PMUY కస్టమర్లలో ఎల్పీజీ సిలిండ‌ర్ల వినియోగం మెరుగుప‌డింది. ఈ నివేదిక ప్ర‌కారం ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ త్రైమాసికంలో ఎల్పీజీ వినియోగంలో 23.2 శాతం పెరుగుద‌ల ఉంది. ఇందుకు PMUY ల‌బ్ధిదారుల‌కు ఇచ్చిన మూడు ఉచిత ఎల్పీజీ రీఫిల్స్ కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

LPG consumption up 7.3% despite price rise: Oil companies

కేంద్రం పేద‌ల‌కు వంట గ్యాస్ అందుబాటులో ఉంచాల‌నే ఉద్దేశంతో PMUY స్కీంలో 8 కోట్ల ఎల్పీజీ క‌నెక్ష‌న్ల‌ను రూ.12,800 కోట్ల ప్ర‌భుత్వ వ్య‌యంతో ల‌బ్ధిదారుల‌కు అందించింది. కరోనా స‌మ‌యంలో అట్ట‌డుగు స్థాయిలో ఉన్నవారి స‌మ‌స్య‌ల‌ను గుర్తించి PMUY ల‌బ్ధిదారుల‌కు మూడు ఉచిత ఎల్పీజీ రీఫిల్స్ అందించింది. మొత్తం రూ.9,670 కోట్లు ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల‌కు నేరుగా బ‌దిలీ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో ఎనిమిది కోట్ల మంది ల‌బ్ధిదారులు ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న ద్వారా 14 కోట్ల ఎల్పీజీ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా అందుకున్నారు.

English summary

ధరలు పెరిగినప్పటికీ, ఎల్పీజీ సిలిండర్ల వినియోగం భారీగా పెరిగింది | LPG consumption up 7.3% despite price rise: Oil companies

Cooking gas LPG consumption rose 7.3% in the last three months despite a steep price rise, with usage among the PMUY beneficiaries, who are mostly poor rural households, jumping near 20%, State-owned oil companies said.
Story first published: Thursday, March 11, 2021, 19:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X