For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్: భారత జీడీపీపై ఫిచ్, ఎస్&పీ అంచనాలు

|

కరోనా సెకండ్ వేవ్, ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు గతంలోని అంచనాల కంటే కాస్త తగ్గుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కేర్ రేటింగ్స్, ఎస్ అండ్ పీ, ఫిచ్ రేటింగ్ వంటి రేటింగ్ ఏజెన్సీలు అంచనాలను సవరిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు తిరిగి వేగంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్, తెలంగాణ వంటి ప్రాంతాల్లో రాత్రి నుండి ఉదయం వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ ప్రభావం భారత జీడీపీపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎస్ అండ్ పీ అంచనా 11 శాతం

ఎస్ అండ్ పీ అంచనా 11 శాతం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశంలో విస్తృతంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత వాతావరణంలో కొవిడ్ 19ని అదుపు చేయడం ఆర్థిక వ్యవస్థ ముందున్న కీలకమైన అంశమని పేర్కొంది. ఎస్ అండ్ పీ ప్రస్తుతం భారత్‌కు బిబిబి మైనస్ రేటింగ్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మైనస్ 8 శాతం నమోదు కావొచ్చునని అంచనాలు ఉన్నాయి.

ఫిచ్ రేటింగ్స్

ఫిచ్ రేటింగ్స్

భారత్‌కు గతంలో కేటాయించిన బీబీబీ మైనస్ పరపతి రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. దేశ పరపతి సామర్థ్యంపై తన ప్రతికూల వైఖరిని కూడా యథాతథంగా కొనసాగించింది. కరోనా ఉధృతితో ఆర్థిక రికవరీ లేదా వృద్ధి రికవరీ జాప్యమయ్యే అవకాశాలు ఉందని, అయితే పూర్తిగా పట్టాలు తప్పే ప్రమాదం లేదని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి క్షీణతను మైనస్ 7.5 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 12.8 శాతంగా ఉండవచ్చునని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 లో వృద్ధి 5.8 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది. గత ఏడాది జూన్ నెలలో భారత పరపతి సామర్థ్యంపై ఫిచ్ తటస్థం నుండి ప్రతికూల స్థాయికి తగ్గించింది.

వ్యవసాయ చట్టాలపై ఫిచ్ రేటింగ్స్

వ్యవసాయ చట్టాలపై ఫిచ్ రేటింగ్స్

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలు భారత జీడీపీని పెంచుతాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారత ఆర్థిక వ్యవస్థకు ఇవి ప్రయోజకరమని ఆర్థికవేత్తలు, రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే అమలులోని ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, ముందుకు వెళ్తే ఈ చట్టాలు ఉపయోగకరమని చెప్పాయి.

English summary

కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్: భారత జీడీపీపై ఫిచ్, ఎస్&పీ అంచనాలు | Lockdowns to hit growth, S&P forecasts 11 per cent growth for India

S&P Global Ratings on Thursday said the Indian economy is projected to grow at 11 per cent in the current fiscal, but flagged the substantial impact of broader lockdowns on the economy.
Story first published: Friday, April 23, 2021, 7:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X