For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BSNL, ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్, రూ.10 సహా ప్రీపెయిడ్ గడువు పొడిగింపు

|

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని TRAI టెల్కోలను ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రీపెయిడ్ యూజర్లంతా నిరంతరాయంగా సర్వీసులు పొందేందుకు వ్యాలిడిటీని పొడిగించడం సహా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

వేతనాలు కట్ చేస్తాం.. జీతాలివ్వం: ఉద్యోగులకు షాక్, ఈ కంపెనీలు మాత్రం శాలరీ పెంచాయివేతనాలు కట్ చేస్తాం.. జీతాలివ్వం: ఉద్యోగులకు షాక్, ఈ కంపెనీలు మాత్రం శాలరీ పెంచాయి

రీఛార్జ్ గడువు పొడిగించండి

రీఛార్జ్ గడువు పొడిగించండి

టెలికం సేవలను నిత్యావసర సర్వీసుల కింద పరిగణించి, మినహాయింపు ఇచ్చినప్పటికీ లాక్ డౌన్ కారణంగా కస్టమర్ సర్వీస్ సెంటర్స్, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్స్ పని చేయకపోవడం వల్ల సర్వీసులకు విఘాతం కలగవచ్చు. రీఛార్జ్ గడువు ముగిసిపోతే ప్రస్తుతం మిగిలి ఉన్న ఆప్షన్ ఆన్‌లైన్ మాత్రమే. అందరికీ ఇది అందుబాటులో ఉండదు లేదా తెలియదు. అలాగే సర్వీస్ సెంటర్స్ లేవు. ఈ నేపథ్యంలో సేవలు నిలిచిపోకుండా ప్రీపెయిడ్ కనెక్షన్ రీఛార్జ్ గడువు పొడిగించాలని ట్రాయ్ సూచించింది. ఆఫ్ లైన్ విధానాల్లో ప్రీపెయిడ్ బ్యాలెన్స్ టాప్ అప్ చేయించుకునేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ట్రాయ్ సూచించింది.

BSNL రూ.10 అదనపు టాక్ టైమ్

BSNL రూ.10 అదనపు టాక్ టైమ్

ట్రాయ్ సూచన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ ఊరటను కల్పించాయి. ప్రీపెయిడ్ వినియోగదారులకు వ్యాలిడిటీ గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ప్రకటించాయి. అలాగే అదనంగా రూ.10 టాక్ టైమ్ అందిస్తున్నట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులు, ముఖ్యంగా పేదలు లాక్ డౌన్ సమయంలో బ్యాలెన్స్ లేకున్నా నిరంతరాయంగా సేవలు పొందే వీలు ఉంటుందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ ట్వీట్ చేశారు.

ఏప్రిల్ 20 వరకు BSNL పొడిగింపు

ఏప్రిల్ 20 వరకు BSNL పొడిగింపు

లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో మార్చి 22వ తేదీ తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన వాళ్లు రీఛార్జ్ చేసుకోలేకపోయారని, కస్టమర్ల కోసం ఏప్రిల్ 20 వరకు గడువును పెంచామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

అదే దారిలో Airtel

అదే దారిలో Airtel

లాక్ డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని అల్పాదాయ వర్గాలకు చెందిన సుమారు 8 కోట్ల పైగా ప్రీపెయిడ్ కస్టమర్ల ప్యాకేజీ కాలపరిమితిని ఏప్రిల్ 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ప్లాన్ గడువు తీరిపోయినా 17వ తేదీ వరకు కస్టమర్లు ఇన్‌కమింగ్ కాల్స్‌ను పొందవచ్చని తెలిపింది. దీంతో పాటు 8 కోట్ల మంది ప్రీపెయిడ్ అకౌంట్‌లలో ఉచితంగా రూ.10 టాక్‌టైమ్ క్రెడిట్ చేస్తున్నట్లు తెలిపింది. టాక్ టైమ్, ఎస్సెమ్మెస్ కోసం ఉపయోగించవచ్చునని, ఈ మొత్తాన్ని రికవరీ చేయబోమని తెలిపింది. 48 గంటల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిన్న తెలిపింది.

English summary

BSNL, ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్, రూ.10 సహా ప్రీపెయిడ్ గడువు పొడిగింపు | lockdown: BSNL, Airtel offer free validity extension, additional talktime

A day after the TRAI requested telecom companies to take steps to ensure prepaid users do not face hardship in the time of lockdown, BSNL and Airtel decided to offer free validity extension and talk time.
Story first published: Tuesday, March 31, 2020, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X