For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC IPO: సర్వం సిద్ధం..ముహూర్తం ఖాయం: విదేశీ పెట్టుబడిదారులు క్యూ

|

న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. ఒక్కో కంపెనీని వదలించుకుంటోంది. అక్షరాలా 38 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ప్రైవేటు పరం చేయబోతోంది. దీనికి సన్నాహాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని విక్రయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే జనవరి-ఫిబ్రవరి-మార్చి కాలంలో పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది.

ప్రభుత్వ రంగ కంపెనీల అమ్మకం వేగవంతం..

ప్రభుత్వ రంగ కంపెనీల అమ్మకం వేగవంతం..

తన ఆధీనంలో.. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ కంపెనీలను సైతం కేంద్ర ప్రభుత్వం ఒక్కటొక్కటిగా ప్రైవేటు పరం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎయిరిండియాను విక్రయించేసింది. 18 వేల కోట్ల రూపాయలకు టాటా సన్స్‌‌కు అమ్మి వేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)దీ అదే దారి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులను కలిగిన ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు విక్రయించనుంది. తన వాటాలను ఉపసంహరించుకోనుంది.

రూ.1.75 లక్షల కోట్లు..

రూ.1.75 లక్షల కోట్లు..

ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటు సంస్థలకు విక్రయించడం ద్వారా కనీసం 1.75 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఇదే క్రమంలో- ఎల్ఐసీ ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి ఉద్దేశించిన ప్రక్రియను డిసెంబర్‌లో మొదలు పెట్టనుంది. ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి సమర్పించనుంది.

సెబి అనుమతి లభించిన వెంటనే..

సెబి అనుమతి లభించిన వెంటనే..

సెబి అనుమతి లభించిన వెంటనే పబ్లిక్ ఇష్యూకు వెళ్తుంది ఎల్ఐసీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే జనవరి-ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎల్ఐసీ ఐపీఓను జారీ చేసే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పటికే ఓపెన్ బిడ్స్ విధానాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా- పలు గ్లోబల్ ఇన్వెస్టర్లు దీనికోసం పోటీ పడుతోన్నాయి. ఈ మెగా ఐపీఓ యాంకర్ బుక్ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ క్యూ కడుతున్నారు.

గ్లోబల్ యాంకర్ ఇన్వెస్టర్లు..

గ్లోబల్ యాంకర్ ఇన్వెస్టర్లు..

బ్లాక్‌రాక్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, బ్లాక్‌స్టోన్, సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, క్యాపిటల్ ఇంటర్నేషనల్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఎల్‌ఐసీ ఐపీఓకు సంబంధించిన యాంకర్ బుక్ అలకేషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వంతో ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ ఎండోమెంట్, బ్రూక్‌ఫీల్డ్, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి కెనడియన్ పెన్షన్ మేనేజర్‌లు త్వరలో దీనికి సంబంధించిన వరుస భేటీలను నిర్వహించబోతున్నారు.

దీపం పర్యవేక్షణలో..

దీపం పర్యవేక్షణలో..

ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియను వేగవంతం చేయడానికి గోల్డ్‌మన్ సాచ్స్, జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్, నోమురా, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జెఎమ్ ఫైనాన్షియల్, ఎస్‌బీఐ క్యాప్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్‌లను షేర్ విక్రయాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం హైర్ చేసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) పర్యవేక్షణలో ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. ఎల్ఐసీ ఐపీఓ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు కూడా.

English summary

LIC IPO expected during January-March quarter, global investors queue up for anchor book

The Department of Investment and Public Asset Management (DIPAM) expects to launch the LIC IPO in the January-March quarter.
Story first published: Saturday, November 27, 2021, 18:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X