For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC IPO: షేర్ల అలాట్‌మెంట్ బిగిన్స్: స్టేటస్ గురించి ఇలా తెలుసుకోండి

|

ముంబై: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రైవేటీకరణలో భాగంగా జారీ చేసిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌‌కు మంచి ఆదరణే లభించింది. ఈ ఐపీఓ- గుడ్ రిటర్న్స్‌ను అందిస్తుందనే అభిప్రాయం మెజారిటీ ఇన్వెన్టర్లలో ఉండటమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. ఎల్ఐసీ మొత్తంగా 16,20,78,067 షేర్లను జారీ చేయగా.. దీనికి దాదాపు మూడురెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. 47,83,67,010 షేర్లను కొనుగోలు చేశారు ఇన్వెస్టర్లు.

పాలసీ హోల్డర్ల పోర్షన్ నుంచి..

పాలసీ హోల్డర్ల పోర్షన్ నుంచి..

రూ.21,000 కోట్లను సమీకించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీఓను జారీ చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడి విలువ 20,557 కోట్ల రూపాయలు. 20,557 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమీకరించుకోగలిగింది. పాలసీ హోల్డర్ల పోర్షన్ నుంచి మాత్రం తిరుగులేని రెస్పాన్స్ లభించింది. 15,391 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను పాలసీ హోలర్డ్ కోసం రిజర్వ్ చేయగా.. రూ.45,379 కోట్ల అప్లికేషన్స్ దాఖలయ్యాయి.

సెలవురోజునా..

సెలవురోజునా..

ఈ నెల 4వ తేదీన ఇది ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీఓ.. 9వ తేదీన ముగిసింది. శనివారం, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉన్నప్పటికీ.. అప్లికేషన్లను దాఖలు చేసుకునే వీలు కల్పించింది సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్. ఎల్ఐసీ ఐపీఓ విషయంలో ఆ వెసలుబాటును కల్పించింది. ప్రైస్ బ్యాండ్‌ 902 నుంచి 949 రూపాయలతో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అలాట్‌మెంట్ రూపంలో ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేయదలిచిన ఇన్వెస్టర్లు ఒక్కో షేర్‌కు గరిష్ఠంగా 949 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. లాట్ సైజ్ 15.

అలాట్‌మెంట్ బిగిన్స్..

అలాట్‌మెంట్ బిగిన్స్..

అంటే.. ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం 14,235 రూపాయలను పెట్టుబడి రూపంలో పెట్టాల్సి ఉంటుంది. ఇలా 13 లాట్ల వరకు తీసుకోవచ్చు. షేర్ల అలాట్‌మెంట్ ప్రక్రియను ఎల్ఐసీ చేపట్టింది. షేర్ల కోసం దాఖలు చేసుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ప్రక్రియను మొదలు పెట్టింది. వారి డీమ్యాట్ అకౌంట్లల్లో షేర్లను డిపాజిట్ చేస్తుంది. ఇది ముగిసిన తరువాత- షేర్లు అలాట్‌మెంట్ దక్కని వారికి రీఫండ్‌ చేస్తుంది ఎల్ఐసీ.

స్టేటస్ గురించి తెలుసుకోండిలా..

స్టేటస్ గురించి తెలుసుకోండిలా..

ఎల్ఐసీ షేర్లు తమకు అలాట్ అయ్యాయా? లేదా అని తెలుసుకోవడానికి ఇన్వెస్టర్లకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక వెబ్‌సైట్, రెండు- ప్రైవేట్ స్టాక్ సర్వీసులను అందించే ఒకట్రెండ్ వెబ్‌సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. బీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ లింక్ bseindia.com/investors/appli_check.aspx లేదా ris.kfintech.com/ipostatus/ipos.aspx ను తొలుత క్లిక్ చేయాలి. ఈక్విటీని ఎంచుకోవాలి.

అక్కడ సెలెక్ట్ ఐపీఓ అనే చోట ఎల్ఐసీ ఐపీఓను ఎంపిక చేసుకోవాలి. అప్లికేషన్, పాన్ నంబర్లను అందులో పొందుపర్చాలి. సబ్‌మిట్ బటన్‌ను క్లిక్ చేసిన వెంటనే షేర్లు అలాట్ అయ్యాయా? లేదా అనేది తెలిసిపోతుంది.

English summary

LIC IPO: షేర్ల అలాట్‌మెంట్ బిగిన్స్: స్టేటస్ గురించి ఇలా తెలుసుకోండి | LIC IPO allotment: Those who applied for the public issue can check the the status here

LIC has announced the allotment of shares for its recently concluded Rs 21,000 crore IPO. Here is the links for checking allotment.
Story first published: Friday, May 13, 2022, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X