For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు సవరించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్

|

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(LIC HFL) ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 24వ తేదీ నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ నెల నాలుగో తేదీన ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో డిపాజిటర్లకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. అదే సమయంలో రుణ గ్రహీతలకు కాస్త వడ్డీ భారం కానుంది.

ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్‌లో ప్రస్తుతం డిపాజిట్లపై 5.60 శాతం నుండి 6.60 శాతం వడ్డీ రేట్లు అమలు అవుతున్నాయి. కనిష్టంగా ఏడాది, గరిష్టంగా అయిదేళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. భారతీయులు, ఎన్నారైలు, గార్డియన్స్ ఉన్న పిల్లలు, హిందూ అవిభాజిత కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు, సహకార సంఘాలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ట్రస్ట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు.

lic hfl FD interest rate revised: latest rates effective from May 24

క్యుములేటివ్ పబ్లిక్ డిపాజిట్ స్కీం పైన వడ్డీ రేట్లు ఏడాది కాలపరిమితిపై 5.60 శాతం, పద్దెనిమిది నెలల వరకు 5.90 శాతం, రెండేళ్ల వరకు 6.25 శాతం, మూడేళ్ల వరకు 6.40 శాతం, అయిదేళ్ల వరకు 6.60 శాతం ఉంది.నాన్-క్యుములేటివ్ పబ్లిక్ డిపాజిట్ వడ్డీ రేట్లు అయితే ఏడాది కాలపరిమితి కలిగిన FDపై నెలవారీ ఆప్షన్ 5.45 శాతం, ఏడాది ఆప్షన్ వడ్డీ రేటు 5.60 శాతంగా ఉంది.

English summary

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు సవరించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ | lic hfl FD interest rate revised: latest rates effective from May 24

Days after Reserve Bank of India Governor Shaktikanta Das announced a 40 basis points hike in the repo rate on May 4, LIC HFL has revised its FD interest rates. The new rates will be effective from May 24, 2022.
Story first published: Monday, May 30, 2022, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X