For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Unemployment: కష్టాల్లో శుభవార్త.. నిరుద్యోగంపై సర్వేలో గుడ్ న్యూస్.. పట్టణ ప్రాంతాల్లో..

|

Unemployment: ఆర్థిక సంక్షోభం మెల్లగా ఒక్కో రంగానికి పాకుతోంది. ఐటీతో మెుదలైన ఉద్యోగుల కోతలు ఇప్పుడు ఇతర పరిశ్రమలను తాకాయి. డిమాండ్ లేకపోవటం, తగ్గుతున్న ఆదాయాలు లాభదాయకతలు కంపెనీలను ఇటువైపు నడిపిస్తున్నాయి. అయితే దేశంలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహించిన సర్వేలోని అంశాలు దీనిపై ఏమి చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

పట్టణ ప్రాంతాల్లో..

పట్టణ ప్రాంతాల్లో..

దేశంలోని పట్టణాల్లో 15 ఏళ్లకు పైబడిన వయస్సు ఉండే వ్యక్తుల నిరుద్యోగిత రేటు జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో గడచిన ఏడాది 9.8 శాతం నుంచి ప్రస్తుతం 7.2 శాతానికి తగ్గిందని సర్వే వెల్లడించింది. 2021 ఇదే కాలంలో కరోనా మహమ్మారి కారణంగా ఇది తీవ్ర స్థాయికి పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణను సూచిస్తోందని నిపుణులు అంటున్నారు.

 PLFS ప్రకారం..

PLFS ప్రకారం..

ఏప్రిల్-జూన్ 2022లో నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో 7.6 శాతంగా ఉన్నట్లు 16వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. అయితే పట్టణ ప్రాంతాల్లోని స్త్రీల నిరుద్యోగం రేటు జూలై-సెప్టెంబర్‌లో 9.4 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది.

 రాహుల్ గాంధీ..

రాహుల్ గాంధీ..

దేశవ్యాప్తంగా భారత్ జొడోయాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ ఇదే సమస్యపై గతంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిరుద్యోగిత దేశంలో శరవేగంగా పెరుగుతోందని ఆక్షేపించారు. వీటికి తోడు ధరల పెరుగుదల సైతం ప్రజలకు మోయలేని భారంగా మారిందని మెదక్ జిల్లా పెద్దాపూర్ గ్రామంలో జరిగిన మీటింగ్‌లో నిప్పులు చెరిగారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలను తప్పుపట్టారు.

English summary

Unemployment: కష్టాల్లో శుభవార్త.. నిరుద్యోగంపై సర్వేలో గుడ్ న్యూస్.. పట్టణ ప్రాంతాల్లో.. | latest NSO survey revealed that unemployment dipped in july-september quarter

latest NSO survey revealed that unemployment dipped in july-september quarter
Story first published: Friday, November 25, 2022, 10:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X