For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాదికి 50 కార్ల విక్రయం లక్ష్యం, హైదరాబాద్‌లోనూ లాంబొర్గిని షోరూం..?

|

ప్రముఖ స్పోర్ట్స్ కార్ల కంపెనీ లాంబొర్గినీ తమ విక్రయాలను మరింత పెంచేందుకు ఫోకస్ చేసింది. ఆర్థికమాంద్యం, ఇతర కారణాలతో సూపర్ లగ్జరీ కార్ల విక్రయాలు తగ్గాయి. 2019లో 17 శాతం పడిపోయాయి. కానీ లాంబొర్గిని కార్లు మాత్రం సేల్ అవుతూనే ఉన్నాయి. గతేడాది లాంబొర్గిన కార్ల విక్రయం 15 శాతం పెరగడం విశేషం. ఈ నేపథ్యంలో భారతదేశంలో తమ కార్ల విక్రయాలపై కంపెనీ మరింత దృష్టిసారించింది.

52 కార్ల విక్రయం

52 కార్ల విక్రయం

2018లో లాంబొర్గిని కంపెనీ కార్లు దేశంలో 45 విక్రయించారు. 2019లో ఆ సంఖ్య 52కి చేరింది. దీంతో విక్రయాలు పడిపోకుండా ఏడాదికి కనీసం 50 కార్ల సేల్స్ జరిగేటట్టు లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. స్పోర్ట్స్ కారు అయిన లాంబొర్గిన ఒక్కొ కారు ధర రూ.2 కోట్ల నుంచి ప్రారంభమవుతోంది. కానీ స్పోర్ట్స్ కార్ల విక్రయాలు 315 నుంచి 260కి పడిపోగా.. లాంబొర్గిని కంపెనీ మాత్రం ఏడాదికి 50 కార్లు విక్రయిస్తామని చెబుతోంది.

 20 శాతం వాటా..

20 శాతం వాటా..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ వొక్ప్ వొగన్ కంపెనీలో భాగస్వామి అయిన లాంబొర్గిని మార్కెట్‌లో 20 శాతం వాటా కలిగి ఉంది. లాంబొర్గిని ప్రత్యర్థి కంపెనీలు ఫెరారీ, ఆస్టాన్ మార్టిన్, బెంట్లీ ఉన్నాయి. లాంబొర్గిని నుంచి హ్యురాకన్ ఈవోవో రియల్ వీల్ డ్రైవ్, హ్యురాకన్ ఈవీవో ఆర్‌డబ్ల్యూడీ సూపర్ స్పోర్ట్స్ కార్లను ప్రవేశపెట్టింది. దీంతో కార్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందిని లాంబొర్గిని ఇండియా అధిపతి శరద్ అగర్వాల్ తెలిపారు.

250 కార్లు..

250 కార్లు..

ఇప్పటికే దేశంలో 250 లాంబొర్గిని కార్లు ఉన్నాయని.. దానిని ఏడాదికి తాము 50 కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శరద్ అగర్వాల్ స్పష్టంచేశారు. లాంబొర్గిని కార్ల విక్రయాలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. 50 శాతానికి మించి వినియోగదారులు సౌత్ ఇండియా నుంచే ఉన్నారని పేర్కొన్నారు.

 హైదరాబాద్‌లో షోరూం...?

హైదరాబాద్‌లో షోరూం...?

కోల్‌కతా, తూర్పు ఇండియాలో కూడా కార్ల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయని శరద్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు. ముంబై, బెంగళూరులో లాంబొర్గిని డీలర్లు ఉన్నారని తెలిపారు. చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలో కూడా విస్తరిస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే ప్రపంచవ్యాప్తంగా లాంబొర్గిని కార్లకు మంచి క్రేజ్ ఉందని చెప్పారు. గత పదేళ్ల నుంచి టాప్-10 కంపెనీల్లో చోటు దక్కించుకుంటుందని వివరించారు. ప్రపంచంలో బిలియనీర్లు పెరగడంతో తమ కార్ల విక్రయాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలో గల విక్రయాలతో పోలిస్తే భారతదేశంలో ఒక్క శాతం కార్లు సేల్ అవుతున్నాయని చెప్పారు.

English summary

ఏడాదికి 50 కార్ల విక్రయం లక్ష్యం, హైదరాబాద్‌లోనూ లాంబొర్గిని షోరూం..? | Lamborghini aims to sell 50 cars a year in India as HNI numbers rise

While the super-luxury car sales segment in India dropped by about 17 per cent in 2019, Lamborghini, which is the market leader in this segment, grew by around 15 per cent.
Story first published: Monday, February 10, 2020, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X