For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము ఉంది: లక్ష్మీ విలాస్ బ్యాంకు డిపాజిటర్లకు హామీ

|

ముంబై: లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB)పై మారటోరియం విధించడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. వీరికి ఆర్బీఐ నియమించిన బ్యాంకు అడ్మినిస్ట్రేటర్, కెనరా బ్యాంకు మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మనోహరన్ హామీ ఇచ్చారు. డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉందని, వారి డబ్బును తిరిగి చెల్లించేందుకు అవసరమైనంత నగదు LVB వద్ద ఉందన్నారు.

డిపాజిటర్ల సొమ్ముకు ఢోకా లేదని, అదే తమ ముందున్న ప్రథమ ప్రాధాన్యమన్నారు. ప్రస్తుతం LVB వద్ద డిపాజిట్ల రూపంలో రూ.20,000 కోట్లు, అడ్వాన్సుల రూపంలో మరో రూ.17,000 కోట్లు ఉన్నాయని తెలిపారు. చెల్లింపులకు అవసరమైన నగదు ఉందన్నారు.

లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం: డిపాజిటర్లకు షాక్... విత్‌డ్రా పరిమితి, DBSలో విలీనం!లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం: డిపాజిటర్లకు షాక్... విత్‌డ్రా పరిమితి, DBSలో విలీనం!

LVBతో డీబీఎస్ వ్యాపార ప్రతిష్టతకు....

LVBతో డీబీఎస్ వ్యాపార ప్రతిష్టతకు....

LVBని డీబీఎస్‌లో విలీన ప్రక్రియ నిర్దేశిత గడువులోగా పూర్తవుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. LVBని డీబీఎస్ బ్యాంకులో విలీనం చేసేందుకు ఉద్దేశించిన తాత్కాలిక డ్రాఫ్టును పబ్లిక్ డొమైన్‌లో పెట్టిన ఆర్బీఐ, ఈ నెల 20న తుది ముసాయిదాను జారీ చేయనుంది. ఈ డీల్ మేరకు LVBలో డీబీఎస్ రూ.2500 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనుంది.

డీబీఎస్ బ్యాంకు భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు LVB విలీనం ఉపయోగపడుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. కొత్తగా మరింత మంది రిటైల్, చిన్న, మధ్యస్థాయి కస్టమర్లను చేరుకోవడానికి తోడ్పడుతుందని తెలిపింది. విలీనం తర్వాత డీబీఎస్(ఇండియా) కస్టమర్ల డిపాజిట్లు, రుణాల పరిమాణం 50 శాతం నుండి 70 శాతం దాకా పెరగవచ్చునని మూడీస్ అంచనా వేసింది. డీబీఎస్‌కు భారత్‌లో 27 శాఖలు ఉన్నాయి. విలీనంతో LVBకి చెందిన దాదాపు 500కు పైగా శాఖలు జత కానున్నాయి.

LVB డిపాజిట్లు, రుణ వివరాలు

LVB డిపాజిట్లు, రుణ వివరాలు

LVB వద్ద నిన్నటి వరకు రూ.20,070 కోట్ల డిపాజిట్లు ఉండగా, ఇందులో టర్మ్ డిపాజిట్ల వాటా రూ.14వేల కోట్లు. సేవింగ్స్, కరెంట్ డిపాజిట్ల వాటా రూ.6,070 కోట్లు. డిపాజిటర్లు 20 లక్షలకు పైగా ఉన్నారు. ప్రకటన తర్వాత ఖాతాదారులు ఏటీఎం ద్వారా రూ.10 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. బ్యాంకు లోన్ బుక్ వ్యాల్యూ రూ.17వేల కోట్లకు పైగా ఉంది.

విలీనంపై వ్యతిరేకత

విలీనంపై వ్యతిరేకత

డీబీఎస్ ఇండియా గ్రూప్‌లో(DBIL) LVB విలీనాన్ని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్(AIBOC) వ్యతిరేకించింది. జాతి ప్రయోజనాలకు విరుద్ధమని, DBILకు బదులు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. విదేశీ బ్యాంకులో విలీనం వద్దన్నారు.

English summary

డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము ఉంది: లక్ష్మీ విలాస్ బ్యాంకు డిపాజిటర్లకు హామీ | Lakshmi Vilas Bank has enough liquidity to pay back depositors

RBI-appointed administrator for Lakshmi Vilas Bank T.N. Manoharan on Wednesday said the bank has enough liquidity to pay back depositors.
Story first published: Thursday, November 19, 2020, 9:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X