ముంబై: ప్రయివేటురంగ కొటక్ మహీంద్రా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పైన వడ్డీ రేట్లను సవరించింది. ఇటీవల HDFC, కెనరా బ్యాంకు అన్ని కాలపరిమితుల ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంకు FD రేట్లను సవరించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్‌కు వడ్డీ రేట్లు ఫిబ్రవరి 4వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. వేర్వేరు కాలపరిమితులకు వడ్డీ రేట్లు 2.50 శాతం నుండి 5.25 శాతం వరకు ఉన్నాయి. ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు FDలను అందిస్తోంది.

వివిధ కాలపరిమితులపై వడ్డీ రేట్లు
7 రోజుల నుండి 14 రోజులు - 2.50%
15 రోజుల నుండి 30 రోజులకు - 2.50%
31 రోజుల నుండి 45 రోజులకు - 2.75%
46 రోజుల నుండి 90 రోజులకు 2.75%
91 రోజుల నుండి 120 రోజులకు - 3.25%
121 రోజుల నుండి 179 రోజులకు - 3.25%
180 రోజుల కాల పరిమితిపై - 4.40%
181 రోజుల నుండి 269 రోజులకు - 4.40%
270 రోజుల కాలపరిమితిపై - 4.40%
271 రోజుల నుండి 363 రోజులు - 4.40%
364 రోజుల కాలపరిమితిపై 4.40%
365 రోజుల నుండి 389 రోజులు - 4.50%
390 రోజులు (12 నెలలు 25 రోజులు) 4.75%
391 రోజుల నుండి 23 నెలలు - 4.75%
23 నెలల కాలపరిమితిపై 4.75%
23 నెలల 1 రోజు నుండి 2 ఏళ్లు - 4.75%
2 ఏళ్ల నుండి 3 ఏళ్లు - 5.00%
3 ఏళ్ల నుండి 4 ఏళ్లు - 5.10%
4 ఏళ్ల నుండి 5 ఏళ్లు - 5.20%
5 ఏళ్ల నుండి 10 ఏళ్లు - 5.25%

సీనియర్ సిటిజన్లకు..
సీనియర్ సిటిజన్లకు సాధారణ కస్టమర్ల డిపాజిట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటు అందిస్తోంది. ఏడు రోజుల నుండి పది సంవత్సరాలలో మెచ్యూరిటీ కలిగి ఎఫ్‌డీలపై 2.5% నుండి 5.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.

వడ్డీ రేట్లు ఇటీవలే తగ్గించిన HDFC
ఇటీవల ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు అన్ని కాలపరిమితుల రుణాలపై MCLRను ఐదు బేసిస్ పాయింట్ల (0.05%) మేర తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనల మేరకు బ్యాంకులు ప్రతి నెలా తమ నిధుల వ్యయం ఆధారంగా రుణ రేట్లను సమీక్షించాలి. సవరించిన అనంతరం HDFC బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గాయి. బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 8వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.HDFC బ్యాంకు ఓవర్ నైట్ MCLR 6.85%, ఒక నెల 6.9%, మూడు నెలలు 6.95%, ఆరు నెలలు 7.05%, ఒక సంవత్సరం 7.2%, రెండు సంవత్సరాలు 7.3%, మూడు సంవత్సరాల కాలపరిమితికి రుణరేటు 7.4%గా ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications