For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ambani vs Adani: ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చింది అంబానీనా..? అదానీనా..? స్పెషల్ స్టోరీ..

|

Ambani vs Adani: 2022 స్టాక్ మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు చాలా విషయాలను నేర్పింది. 2008 తర్వాత మళ్లీ మాంద్యం పరిస్థితులు ఆవరించటంతో అంతర్జాతీయంగా మార్కెట్లు చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇలాంటి స్థితిలోనూ కొన్ని కంపెనీలు మాత్రం మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. కొన్ని మాత్రం ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి.

అంబానీ Vs అదానీ..

అంబానీ Vs అదానీ..

ప్రస్తుత తరుణంలో అంబానీ, అదానీ కంపెనీలు ఎలాంటి పనితీరు కనబరిచాయి. తమ ఇన్వెస్టర్లకు ఈ వ్యాపారవేత్తలకు చెందిన గ్రూప్ కంపెనీలు ఎలాంటి రాబడులను అందించాయో ఇప్పుడు చూద్దాం. ఈ క్రమంలో అదానికి ఉన్న మెుత్తం ఏడు స్టాక్స్ సానుకూల రాబడిని అందించాయి. అదానీ పవర్ 2022లో దాదాపు 163% లాభాలతో అగ్రగామిగా నిలిచింది.

అదానీ విల్మర్..

అదానీ విల్మర్..

అదానీ గ్రూప్ ఎఫ్ఎమ్సీజీ కంపెనీ అయిన విల్మర్ ఈ వారం అప్పర్ సర్క్యూట్ కొడుతూ ఇన్వెస్టర్లను 86.25% రాబడిని అందించి ధనవంతులను చేసింది. ఈ క్రమంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2022లో 113% రాబడిని అందించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక అదానీ టోటల్ గ్యాస్ 87.74%, అదానీ ట్రాన్స్ మిషన్ 30%, అదానీ గ్రీన్ ఎనర్జీ 35.99%, అదానీ పోర్ట్స్ అండ్ SEZ 8.74% పెరిగి తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి. ఈ కంపెనీల షేర్లలో పెట్టిన ఇన్వెస్టర్లు ఊహించని ఆదాయాన్ని పొందారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్..

రిలయన్స్ ఇండస్ట్రీస్..

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ప్రకారం 2022లో 5.65% తగ్గిన రాబడిని అందించింది. స్టాక్ వరుసగా ఏడు సంవత్సరాలు సానుకూల రాబడిని అందించింది. అయితే అంబానీ వారసులు రంగంలోకి దిగిన తర్వాత వ్యాపారాలు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇది కంపెనీకి రానున్న కాలంలో మరింత లాభదాయకమైనదిగా మార్చటానికి దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో అంబానీ చాలా కొత్త పెట్టుబడులతో మెగా విస్తరణను ప్రారంభించారు.

ఇతర అంబానీ కంపెనీలు..

ఇతర అంబానీ కంపెనీలు..

అంబానీ నేతృత్వంలోని హాత్వే కేబుల్‌39% నష్టాలతో డిసెంబర్ మధ్య నాటికి గ్రూప్ లో అతిపెద్ద నష్టాన్ని కలిగి ఉంది. అలాగే.. జస్ట్ డయల్ 26% నష్టపోయింది. ఇదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 20%, నెట్‌వర్క్ 18 మీడియా & ఇన్వెస్ట్‌మెంట్స్ 16% నష్టాల్లో ఉన్నాయి. అంటే ముకేష్ అంబానీకి చెందిన చాలా వ్యాపారాలు అనుకున్న స్థాయిలో 2022లో పనితీరు కనబరచలేకపోయాయి. ఇవి ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించటంలో విఫలమయ్యాయి.

టాటా గ్రూప్ కంపెనీలు..

టాటా గ్రూప్ కంపెనీలు..

అంబానీ, అదానీల విషయాన్ని పక్కనబెడితే.. టాటా గ్రూప్ లోని ఇండియన్ హోటల్స్ కంపెనీ షేర్లు ఈ సంవత్సరం 65.69% పెరిగాయి. ఆ తర్వాత ట్రెండ్ స్టాక్ 20.56% లాభపడింది. అలాగే.. టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో సహా ఇతర టాటా స్టాక్స్ 8-42% మధ్య లాభపడ్డాయి. అలాగే టీటీఎంఎల్ షేర్లు 60% క్రాష్ కాగా, వోల్టాస్, టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా మెటాలిక్స్, టీసీఎస్, నెల్కో షేర్లు 13-30% మధ్య క్షీణించాయి.

ఆదిత్య బిర్లా గ్రూప్..

ఆదిత్య బిర్లా గ్రూప్..

ఇక అంబానీ, టాటాల తర్వాత భారత వ్యాపార రంగంలో గుర్తించదగినది ఆదిత్య బిర్లా గ్రూప్. బిర్లా గ్రూప్ కంపెనీలను గమనిస్తే.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ 15.69%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 5.34%, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ 4.90% లాభపడి ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందించాయి. అయితే బిర్లా గ్రూప్ పెట్టుబడులు ఉన్న వోడాఫోన్ ఐడియా 2022లో భారీ నష్టాలతో స్టాక్ క్రాష్ అయ్యింది. దీని తర్వాత హిందాల్కొ 9%, అల్ట్రాటెక్ సిమెంట్ 8% మేర నష్టపోయాయి.

English summary

Ambani vs Adani: ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చింది అంబానీనా..? అదానీనా..? స్పెషల్ స్టోరీ.. | know whose stocks made investors rich Adani, ambani, tata or Birla's in 2022

know whose stocks made investors rich Adani, ambani, tata or Birla's in 2022
Story first published: Wednesday, December 28, 2022, 12:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X