For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Salary Hike 2023: జీతాల పెంపుపై తాజా సర్వే రిపోర్ట్.. IT ఉద్యోగులకు మాత్రం

|

Salary Hikes 2023: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో అసలు ఉద్యోగాలు ఉంటాయా లేక ఊడతాయా అని చాలా మందిలో అనుమానం ఉంది. ఇలాంటి తరుణంలో 2023లో జాతాల పెంపుకు సంబంధించి గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ AON తన సర్వే రిపోర్టును విడుదల చేసింది. అసలు అత్యధిక జీతాలు ఏ రంగంలో పనిచేసేవారికి పెరగబోతున్నాయో ఓ లుక్కేద్దాం..

భారతదేశంలో పెంపులు..

భారతదేశంలో పెంపులు..

అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు మన దేశంలో జీతాల పెంపు 2023లో ఎలా ఉంటుందని ఏవోఎన్ సర్వే వెల్లడించింది. సర్వే ప్రకారం దేశంలో జీతాలు అత్యధికంగా 10.3 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేయబడింది. దీనికి ముందు 2022లో దేశంలో జీతాల పెంపు 10.6 శాతంగా ఉంది. ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఉన్న డిమాండ్, సరఫరా అంతరాయం వల్ల 2022లో అట్రిషన్ రేటు 21.4% గా ఉంది. దీంతో జీతాల్లో రెండంకెల పెంపు ఉండవచ్చని సర్వే అంచనా వేసింది.

1400 కంపెనీల డేటా..

1400 కంపెనీల డేటా..

ఈ సర్వేలో 40కిపైగా పరిశ్రమల్లోని 1,400 కంపెనీల డేటాను విశ్లేషణ ఆధారంగా సర్వేను నిర్వహించారు. పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి ఈ ఏడాది జీతాల పెంపు ప్రణాళికను కష్టతరం చేస్తున్నాయని హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ కు చెందిన రూపంక్ చౌదరి అన్నారు. టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్, ఉత్పత్తులు వంటి ప్రపంచవ్యాప్తంగా అనుసంధానించబడిన పరిశ్రమలు తమ జీతం బడ్జెట్‌లలో కొంత జాగ్రత్తగా ఉంటాయని ఆయన అన్నారు.

ఫ్లిప్ కార్ట్ నిర్ణయం..

ఫ్లిప్ కార్ట్ నిర్ణయం..

మార్చి వస్తున్న తరుణంలో దేశంలోని అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అందించాల్సిన హైక్స్ విషయంలో తమ కసరత్తును ఇప్పటికే ప్రారంభించాయి. ఈ ఏడాది ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 5000 మంది సీనియర్ ఉద్యోగులకు జీతాల్లో పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న 30 శాతం మంది ప్రభావితం కానున్నట్లు వెల్లడైంది. దీనికి మార్కెట్లోని ప్రతికూల పరిస్థితులను కంపెనీ కారణంగా చెబుతోంది.

ఏఏ రంగాల్లో జీతాల పెంపు ఎలా ఉంటుందంటే..?

ఏఏ రంగాల్లో జీతాల పెంపు ఎలా ఉంటుందంటే..?

* సాంకేతిక వేదిక మరియు ఉత్పత్తులు: 10.9%

* ప్రపంచ సామర్థ్య కేంద్రాలు: 10.8%

* టెక్నాలజీ కన్సల్టింగ్ & సేవలు: 10.7%

* ఆర్థిక సంస్థలు: 10.1%

* ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG)/ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ (FMCD): 10.1%

* తయారీ: 9.9%

* లైఫ్ సైన్సెస్: 9.7%

* రిటైల్: 9.7%

* ప్రొఫెషనల్ సర్వీసెస్: 11.2%

* e-కామర్స్: 12.2%

* ఇతర సేవలు: 9.6%

Read more about: salary hikes
English summary

Salary Hike 2023: జీతాల పెంపుపై తాజా సర్వే రిపోర్ట్.. IT ఉద్యోగులకు మాత్రం | Know salary hike projections survey report for 2023 amid financial uncertainities

Know salary hike projections survey report for 2023 amid financial uncertainities
Story first published: Friday, February 24, 2023, 10:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X