For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Currency Notes: నోట్లపై దేవుని చిత్రాలు ప్రింట్ చేయెుచ్చా..? రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..

|

Currency Notes: ప్రపంచంలో చాలా పనులు నిర్వహించటానికి డబ్బు కావాలి. డీమానిటైజేషన్ వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రతి భారతీయుడికీ ఈ విషయం బాగా తెలుసు. రోజు వారీ చెల్లింపుల కోసం మాధ్యమంగా ఉన్న కరెన్సీ నోట్లపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. వాటిపై దేవును ఫోటోలు ప్రింట్ చేయాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సూచించటం చర్చనీయాంశంగా మారింది.

అందరిలో కామన్ డౌట్..

కరెన్సీలు దేశానికి సంబంధించిన చాలా విషయాలను ప్రతిబింబిస్తుంటాయి. మన దేశంలో స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీజీ చిత్రంతో పాటు.. కోణార్క్ సూర్య దేవాలయం, మంగళయాన్ మెుదలైన చిత్రాలు కరెన్సీలపై ముద్రించబడి ఉన్నాయి. ఈ క్రమంలో అసలు నోట్లపై ఏ ఫోటోలు ముద్రించాలి..? వాటిని ఎవరు ఎలా నిర్ణయిస్తారు..? వాటికి సంబంధించిన రూల్స్ ఏమిటి..? వంటి అనుమానాలు మనలో చాలా మంది మదిలో మెుదలయ్యాయి.

కేజ్రీవాల్ విజ్ఞప్తి..

కేజ్రీవాల్ విజ్ఞప్తి..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారత కరెన్సీలపై గణపతి, మహాలక్ష్మి దేవతల బొమ్మలు ముద్రించాలని డిమాండ్ చేశారు. అలా చేయటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, పడిపోతున్న రూపాయికి మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని దీనిపై ఆలోచించాలని కోరారు. ఇది రాజకీయ డిమాండ్ గా కనిపిస్తున్నప్పటికీ.. అసలు వీటికి సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

కరెన్సీ ముద్రణ రూల్స్..

కరెన్సీ ముద్రణ రూల్స్..

నిబంధనల గురించి తెలుసుకున్నట్లయితే.. దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే పని రిజర్వ్ బ్యాంకుదే. అయితే నోట్ల ముద్రణకు సంబంధించిన పూర్తి ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ చట్టంలో నిర్ణయించబడింది. RBI ఆధీనంలోైని వివిధ ప్రింటింగ్ ప్రెస్ లలో ప్రత్యేక కాగితంపై ముద్రణ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే ఇందుకోసం రిజర్వు బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. డిజైన్, ముద్రించాల్సిన చిత్రం నిర్ణయాలు రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా తీసుకుంటారు.

సమాచార హక్కు వివరాలు..

సమాచార హక్కు వివరాలు..

సమాచార హక్కు కింద ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ నుంచి సమాచారం కోరగా వచ్చిన వివరణ ప్రకారం.. RBI Act 1934లోని సెక్షన్ 25 ప్రకారం చిత్రాల ముద్రణ సంయుక్త నిర్ణయంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న కరెన్సీ నోట్లపై ఎలాంటి మార్పులు చేయాలన్నా.. జాయింట్ ప్యానెల్ నిర్ణయిస్తుందని వెల్లడైంది.

కరెన్సీలపై చిత్రాలు..

కరెన్సీలపై చిత్రాలు..

భారతీయ కరెన్సీ నోట్లపై గాంధీజీ చిత్రాన్ని ప్రధానంగా ముద్రిస్తారు. నోటుకు మరోపక్క జాతీయ గుర్తింపు, అహంకారానికి సంబంధించిన మరికొన్ని చిత్రాలు ఉంటాయి. నోట్లపై జాతీయ చిహ్నమైన అశోక స్తంభం, పార్లమెంటు భవనం ఉంటాయి. ఇవి కాకుండా.. రాయల్ బెంగాల్ టైగర్స్, ఆర్యభట్ట ఉపగ్రహం, వ్యవసాయం, షాలిమార్ గార్డెన్, కోణార్క్ దేవాలయం, బృహదీశ్వర దేవాలయం, మంగళయాన్ వంటివి ఉన్నాయి.

English summary

Currency Notes: నోట్లపై దేవుని చిత్రాలు ప్రింట్ చేయెుచ్చా..? రూల్స్ ఏమి చెబుతున్నాయంటే.. | know procedure how currency notes desigh and printing decisions are made

know procedure how currency notes desigh and printing decisions are made
Story first published: Thursday, October 27, 2022, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X