For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FD Maturity Rules: మారిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్.. తెలుసుకోకపోతే నష్టపోతారు.. RBI ప్రకారం

|

FD Maturity Rules: బ్యాంకింగ్ రంగంలో అన్ని రకాల విధానపరమైన నిర్ణయాలను రిజర్వు బ్యాంక్ తీసుకుంటుంది. అయితే ఈ క్రమంలో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూల్స్ మారిన విషయం చాలా మందికి తెలియదు. గతంలో డిపాజిట్ చేసిన కాల వ్యవధి పూర్తైతే బ్యాంక్ ఆటోమెటిక్ గా అదే కాలానికి వాటిని తిరిగి రీ డిపాజిట్ చేసేది. దీనివల్ల పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగేది. కానీ మారిన రూల్స్ ప్రకారం ఇలా చేస్తే నష్టపోవాల్సి ఉంటుంది.

పెరుగుదున్న వడ్డీ రేట్లు..

పెరుగుదున్న వడ్డీ రేట్లు..

భారత సెంట్రల్ బ్యాంక్ గతకొన్ని నెలలుగా తన వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ సమయంలో వడ్డీ నష్టపోకుండా ఉండాలంటే మారిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్ మనం తప్పక తెలుసుకోవాల్సిందే. లేదంటే నష్టాన్ని తప్పక భరించాల్సి ఉంటుంది.

మారిన మెచ్యూరిటీ రూల్స్..

మారిన మెచ్యూరిటీ రూల్స్..

RBI ఫిక్స్‌డ్ డిపాజిట్ నియమాలను మార్చింది. మారిన నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీరు మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ఆ డబ్బు మెుత్తాన్ని క్లెయిమ్ చేయకపోతే దానిపై గతంలో కంటే తక్కువ వడ్డీ పొందుతారు. అది మీ మామూలు సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ పై బ్యాంక్ చెల్లించే తక్కువ వడ్డీకి సమానమైనదిగా ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లు టర్మ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9 శాతం వరకు ఉండగా.. సేవింగ్స్ ఖాతలకు చెల్లించే వడ్డీ దాదాపు 4 శాతం వరకు ఉంది.

రూల్స్ ఎవరకి వర్తిస్తాయి..

రూల్స్ ఎవరకి వర్తిస్తాయి..

రిజర్వు బ్యాంక్ తెచ్చిన మార్పులు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు వర్తిస్తుంది. మారిన రూల్స్ ప్రకారం డిపాజిట్ కాలం ముగిసిన తర్వాత డిపాజిటర్ దానిని క్లెయిమ్ చేయకపోతే దానికి సేవింగ్స్ అకౌంట్ కు చెల్లించే వడ్డీ రేటు లేదా మెచ్యూర్డ్ FDలకు సూచించిన వడ్డీ రేటులో ఏది తక్కువైతే దానిని సదరు బ్యాంక్ చెల్లిస్తుంది. దీని వల్ల మన డబ్బు బ్యాంక్ వద్దే ఉన్నప్పటికీ.. వడ్డీ ఆదాయాన్ని నష్టపోవాల్సి ఉంటుంది.

గతంలో నియమాలు ఏమిటి..?

గతంలో నియమాలు ఏమిటి..?

గతంలో డిపాజిట్లపై రూల్స్ ఎలా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకురాకమునుపు.. ఎవరైనా డిపాజిటర్ తన ఎఫ్ డీ కాలపరిమితి దాటిన తర్వాత ఆ మెుత్తాన్ని ఉపసంహరించకపోయినా లేదా క్లెయిమ్ చేయకపోయినా బ్యాంక్ అదే కాలానికి డిపాజిట్లను తిరిగి అదే కాలానికి బ్యాంకులు తిరిగి డిపాజిట్ చేసేవి.. కానీ మారిన నిబంధనల ప్రకారం అలా కుదరదు. అందుకే కొత్త రూల్స్ ప్రకారం మెచ్యూర్ అయిన వెంటనే డబ్బును విత్‌డ్రా చేసుకోవడం మంచిది

English summary

FD Maturity Rules: మారిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్.. తెలుసుకోకపోతే నష్టపోతారు.. RBI ప్రకారం | Know new FD Maturity Rules brought by RBI to save loosing Interest Income

Know new FD Maturity Rules brought by RBI to save loosing Interest Income
Story first published: Friday, January 20, 2023, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X