For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ratan Tata: రతన్ టాటా రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా..? అంబానీ ఎంత ఆర్జిస్తున్నారంటే..?

|

Ratan Tata: రతన టాటా వ్యాపార సామ్రాజ్యంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి. ఆయన సింప్లిసిటీ తరువాతే ఎవరైనా అనే విషయం వ్యాపార వర్గాల్లోనే కాక సామాన్యులకు సైతం తెలుసు. దేశానికి ఎలాంటి అవసరం ఉందంటే ముందుకు వచ్చే మెుదటి వ్యాపార సంస్థ టాటాలే.

రతన్ టాటా స్వభావం..

రతన్ టాటా స్వభావం..

మీపై ఎవరైనా మీపై రాయి విసిరితే మీరు ఏమి చేస్తారు..? మనలో చాలామంది దానిని తిరిగి మనపై దాడి చేసినవారిపై మళ్లీ వేయాలని భావిస్తాం. అయితే.. రతన్ టాటా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తారు. మనపై ఇతరులు విసిరిన రాళ్లతో భవనాన్ని నిర్మించమని రతన్ నవాల్ టాటా చెబుతుంటారు. ఇలా భారత్‌లో ఉప్పు నుంచి విమానయానం వరకు అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలను కలిగి ఉన్న టాటాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిఉన్నారు.

 విజయవంతమైన వ్యక్తిగా..

విజయవంతమైన వ్యక్తిగా..

ఇలా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న రతన్ టాటా ఆదాయం ఎంతో తెలుసా? గొప్ప వ్యాపారవేత్త మాత్రమే కాక బిలియనీర్ అయిన రతన్ టాటా.. టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ కూడా. యువతరానికి మార్గదర్శకంగా నిలిచిన రతన్ టాటా యువతకు వ్యాపార నైపుణ్యాల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. అతను తన స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక లక్షల మంది పేద పిల్లలకు, నిరుపేద పిల్లలకు, వికలాంగులకు సహాయం చేస్తున్నారు.

 రోజువారీ ఆదాయం ఎంత..?

రోజువారీ ఆదాయం ఎంత..?

రతన్ టాటా రోజువారీ ఆదాయం కేవలం రూ.18,739 లేదా 347 డాలర్లని చెప్పుకోవాలి. అంటే ఆయన నెలవారీ ఆదాయం దాదాపుగా రూ.5.70 లక్షలు. అంటే నెలకు 7,122 డాలర్లన్నమాట. అంటే రతన్ టాటా ప్రతి గంటకు సగటున రూ.780 లేదా 10 డాలర్లను సంపాదిస్తున్నారు.

రిటైర్మెంట్..

రిటైర్మెంట్..

2012లో టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2017లో నటరాజన్ చంద్రశేఖరన్ పదవికి వచ్చినప్పుడు, రతన్ టాటా ఛైర్మన్ పదవి నుంచి పూర్తిగా రిటైర్ అయ్యారు. అయితే.. ఇప్పటి వరకు రతన్ టాటా సంవత్సరానికి రూ.68.4 లక్షలు సంపాదిస్తున్నట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి.

 ముఖేష్ అంబానీ సంపాదన..

ముఖేష్ అంబానీ సంపాదన..

దేశంలోనే రెండవ సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ నిమిషానికి భారీగానే సంపాదిస్తున్నారని చెప్పుకోవాలి. అంబానీ నికర సంపద దాదాపు 94 బిలియన్ డాలర్లు (7 లక్షల కోట్లు). నిమిషానికి ఆయన దాదాపుగా రూ. 22 లక్షలకు పైగానే సంపాదిస్తున్నారు. బిలియనీర్ నివేదిక ప్రకారం.. ప్రతి గంటకు రూ. 13.67 కోట్లను ఆర్జిస్తున్నారు.

 అంబానీ ఒక్క రోజు ఆదాయం ఎంతంటే..

అంబానీ ఒక్క రోజు ఆదాయం ఎంతంటే..

ముఖేష్ అంబానీ 2021లో ప్రతిరోజూ రూ.164 కోట్లు (20 మిలియన్ డాలర్లు) సంపాదించినట్లు న్యూస్ 18 నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తాజాగా గత నెలలో వారసులకు వివిధ కంపెనీల బాధ్యతలను పూర్తి స్థాయిలో అందించటం మెుదలు పెట్టారు. ఇప్పటికే పెద్ద కుమారుడికి రిలయన్స్ జియో, కూతురికి రిలయన్స్ రిటైల్ చైన్ బాధ్యతలను అప్పగించారు.

English summary

Ratan Tata: రతన్ టాటా రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా..? అంబానీ ఎంత ఆర్జిస్తున్నారంటే..? | know howmuch mukesh ambani and ratan tata earning perday from their businesses in detail

know howmuch mukesh ambani and ratan tata earning
Story first published: Sunday, August 7, 2022, 8:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X