For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Income Tax: మీరు టాక్స్ పరిధిలో ఉన్నారా.. అయితే ఫారం-16 గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

|

Income Tax Filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీ సమీపిస్తోంది. ప్రస్తుతానికి జూలై 31 వరకు ఫైలింగ్ కు అనుమతి ఉంది. మరోవైపు అన్ని కంపెనీలు కూడా జూన్- 15 వరకు తమ ఉద్యోగులకు ఐటీఆర్ ఫారం-16 జారీ చేశాయి. దీని సహాయంతో ఉద్యోగులందరూ తమ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. చాలా కాలంగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్న వారికి ఫారం-16 గురించి బాగా తెలుసే ఉంటుంది. కానీ.. ఇటీవల ఉద్యోగం ప్రారంభించిన వారు లేదా ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చిన వారు ఫారం-16 కోసం దరఖాస్తు చేసుకోవాలి. దానిలో ఎలాంటి వివరాలు అందించాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

అసలు ఈ ఫారం- 16 అంటే ఏమిటి..?

అసలు ఈ ఫారం- 16 అంటే ఏమిటి..?

కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేస్తాయి. ఇది ఉద్యోగి జీతంపై మినహాయించబడిన పన్నుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు.. ఉద్యోగి HRA లేదా అన్ని రకాల ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం ద్వారా పన్ను ఆదా చేసినట్లయితే.. ఆ సమాచారం కూడా ఫారం-16లో ఇవ్వటం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫారం-16 అనేది ఉద్యోగి జీతంపై పన్ను లెక్కింపు సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. ఈ సర్టిఫికెట్‌ను కంపెనీలు ప్రభుత్వానికి కూడా సమర్పిస్తాయి.

ఫారం-16 మొదటి భాగం..

ఫారం-16 మొదటి భాగం..

ఫారం 16 మొదటి భాగంలో జీతంపై తీసివేయబడిన పన్నుకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇది TRACES పోర్టల్ నుంచి యజమాని ద్వారా రూపొందించబడి, డౌన్‌లోడ్ చేయబడుతుంది. ఫారమ్- 16లోని మొదటి భాగంలో యజమాని పేరు, చిరునామా, PAN వివరాలు, యజమాని TAN, ఉద్యోగి PAN వివరాలతో పాటు మొదలైనవి ఉంటాయి. అదనంగా, ఉద్యోగికి సంబంధించి చెల్లించిన లేదా క్రెడిట్ చేయబడిన మొత్తం, ఇతర TDS మినహాయింపులకు సంబంధించిన వివరాలు ఉంటాయి.

ఫారం-16 రెండవ భాగం..

ఫారం-16 రెండవ భాగం..

ఫారం-16లోని రెండవ భాగం ఉద్యోగులకు చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి. ఇందులో.. పన్ను నుంచి అన్ని మినహాయింపుల వరకు మొత్తం సమాచారం ఉంటుంది. ఈ భాగం మీ జీతానికి సంబంధించిన వివరణాత్మక వివరణను కలిగి ఉంటుంది. ఇది కాకుండా సెక్షన్- 10 కింద మినహాయింపు పరిధి వరకు అలవెన్సుల గురించి సమాచారం కూడా ఉంటుంది. అదనంగా ఆదాయపు పన్ను చట్టంలోని చాప్టర్ VI-A కింద మినహాయింపులు, సెక్షన్- 89 కింద ఉపశమనం గురించిన సమాచారం ఉంటుంది.

మీరు ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ మంది యజమానుల వద్ద పనిచేసినట్లయితే.. మీకు రెండు ఫారమ్-16లు అవసరం అవుతాయి. ఫారం-16 రెండింటినీ కలపడం ద్వారా మీరు ITR ఫైల్ చేసేటప్పుడు సమాచారాన్ని పూరించాల్సి ఉంటుంది. ప్రతి యజమాని పన్నుచెల్లింపుదారులకు ఫారమ్-16ని తప్పక జారీ చేయాలి. ఏదైనా పెట్టుబడి గురించి యజమానికి తెలియజేయడం మర్చిపోయి ఉంటే, మీరు ITR ఫైల్ చేస్తున్నప్పుడు దాన్ని చేర్చవచ్చు. ఒక వేళ గతంలో టాక్స్ కట్ అయితే అది తిరిగి వాపసు వస్తుంది.

Read more about: income tax
English summary

Income Tax: మీరు టాక్స్ పరిధిలో ఉన్నారా.. అయితే ఫారం-16 గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. | Know full details about form-16 issued by companies to its employees for filing their tax returns

know in detail about ITR Form-16 of income tax department and its uses
Story first published: Monday, June 27, 2022, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X