For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Passport: ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్టు ఏదో తెలుసా.. భారత్, చైనాల ర్యాంక్ చూద్దాం..

|

Passport: ఒక దేశం నుంచి మరో దేశానికి చేరుకోవటానికి వీసా, పాస్‌పోర్టు చాలా ముఖ్యమైనవి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఎంపిక రెండు ప్రధాన అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది. ఒకటి పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ (PPR), మరొకటి వెల్కమింగ్ కంట్రీ స్కోర్ (WCS). పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ ను.. పాస్‌పోర్ట్‌లు వాటి మొబిలిటీ స్కోర్ ఆధారంగా ర్యాంక్ చేయబడతాయి. అత్యధిక మొబిలిటీ స్కోర్‌తో ఉండే పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్‌లో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మొబిలిటీ స్కోర్ అనేది ఎటువంటి పరిమితులు లేకుండా ఒక దేశ పాస్‌పోర్ట్‌ను ఆమోదించే దేశాల సంఖ్య. వెల్కమింగ్ కంట్రీ స్కోర్ (WCS) ప్రతి దేశం వీసా రహితంగా లేదా వీసా ఆన్ అరైవల్‌తో ఆమోదించే పాస్‌పోర్ట్‌ల సంఖ్యను బట్టి ర్యాంక్ చేస్తుంది.

 జపాన్ NO-1

జపాన్ NO-1

పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ (PPR), వెల్కమింగ్ కంట్రీ స్కోర్ (WCS) ఆధారంగా జపాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్. జపాన్ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఏకంగా 193 దేశాలకు ఇబ్బంది లేకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంది.

సింగపూర్, దక్షిణ కొరియా NO-2

సింగపూర్, దక్షిణ కొరియా NO-2

ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. సింగపూర్, సౌత్ కొరియాలు సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నాయి.

భారత్ పాస్ పోర్ట్..

భారత్ పాస్ పోర్ట్..

శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత పాస్‌పోర్ట్ 87వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు భూటాన్, నేపాల్, ఇండోనేషియా, మకావుతో సహా 60 దేశాలకు వీసా రహిత యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.

పౌరసత్వం వదులుకున్న భారతీయులు..

పౌరసత్వం వదులుకున్న భారతీయులు..

తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2021లో 1,63,370 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వాన్ని పొందారు. వీరిలో 78,284 మంది USలో పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో 23,533, కెనడా 21,597, యునైటెడ్ కింగ్‌డమ్ 14,637 ఉన్నాయి.

 ప్రముఖ దేశాల పాస్‌పోర్ట్స్..

ప్రముఖ దేశాల పాస్‌పోర్ట్స్..

1వ స్థానంలో జపాన్; 2వ స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియాలు పంచుకోగా; జర్మనీ, స్పెయిన్ 3వ స్థానంలో; ఫిన్లాండ్, లక్సెంబర్గ్, ఇటలీ 4వ స్థానంలో; ఆస్ట్రియా , డెన్మార్క్ 5వ స్థానంలో ఉన్నాయి.

చైనా, ఆఫ్ఘనిస్తాన్ వివరాలు..

చైనా, ఆఫ్ఘనిస్తాన్ వివరాలు..

చైనా పాస్‌పోర్ట్ 69వ స్థానంలో ఉండగా.. ఇది 80 దేశాలకు యాక్సెస్‌ను అందిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్ హెన్లీ & పార్ట్‌నర్స్ జాబితాలో అట్టడుగున ఉంది. దీని ద్వారా ఆ దేశ పాస్ పోర్ట్ కలిగిన వ్యక్తులు కేవలం 27 దేశాలకు యాక్సెస్‌ ఉంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దీని స్కోర్ క్షీణించింది.

English summary

Passport: ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్టు ఏదో తెలుసా.. భారత్, చైనాల ర్యాంక్ చూద్దాం.. | know about powerful Passport in world where india and china standing in this rankings

know about powerful Passport in world
Story first published: Friday, July 22, 2022, 15:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X