For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan Yojana: పీఎం కిసాన్ పైసలు రావాలంటే.. ఆ పని చేయాల్సిందే..

|

రైతులకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2018లో ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ సంవత్సరానికి రూ.6000 మూడు విడతల్లో అంటే రూ.2000 చొప్పున అందిస్తారు. 2019లో ఈ పథకాన్ని సవరించి భూ పరిమాణంతో సంబంధం లేకుండా పథకాన్ని వర్తింప జేస్తోంది.

వీరు అనర్హులు

వీరు అనర్హులు

సంస్థాగత భూస్వాములు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్న రైతు కుటుంబాలు, పదవీ విరమణ పొందిన అధికారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి నిపుణులు, నెలవారీగా రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ ఉన్న రిటైర్డ్ పెన్షనర్లు కూడా ఈ పథకానికి అనర్హులు.

11 విడత విడుదల

11 విడత విడుదల

కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ డబ్బుల కోసం ఈకేవైసీ చేసుకోవాలని కోరింది. 11వ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోగా.. కొందరు చేసుకోలేదు. దీంతో వారికి 11వ విడత డబ్బులు పడలేదు. దీంతో కేంద్రం ఈకేవైసీ గడవును పొడగించింది. ఆలోపు ఈకేవైసీ చేసుకున్నవారికే డబ్బులు వస్తాయని పేర్కొంది.

ఈకేవైసీ ఎలా చేసుకోవాలి

ఈకేవైసీ ఎలా చేసుకోవాలి

ఈకేవైసీ చేసుకోవడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయింది. అలోపు ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ అయిన వారు స్మార్ట్ ఫోన్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్లోకి వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ లింక్ లేని వారు దగ్గరలోని మీసేవకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు.

English summary

PM Kisan Yojana: పీఎం కిసాన్ పైసలు రావాలంటే.. ఆ పని చేయాల్సిందే.. | July 31 last date for PM-Kisan Samman Nidhi Ekyc

It is mandatory for the registered Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) Scheme beneficiaries to complete the eKYC process. The last date to do the same is nearing. It can be noted that PM Kisan Scheme beneficiaries need to complete the KYC process by July 31, 2022.
Story first published: Saturday, July 16, 2022, 10:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X