For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: వచ్చే వారమే JioPhone Next, ధర, ఫీచర్స్ ఇవేనా?

|

భారత్‌లో జియోఫోన్ నెక్స్ట్ (JioPhone Next) ప్రీ-బుకింగ్ వచ్చే వారం ప్రారంభం కానుందని సమాచారం. దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో, ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కలిసి JioPhone Nextను డెవలప్ చేశాయి. ఈ ఫోన్ పైన ఇప్పటికే ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్ సెప్టెంబర్ 10వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు ఇది అత్యంత చౌకైన ఫోన్‌గా భావిస్తున్నారు. జూన్ నెలలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)లో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. వచ్చే నెలలో విక్రయానికి సిద్ధమవుతోంది. జియో ఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్‌లో HD డిస్‌ప్లే, 3GB ర్యామ్ ఉండవచ్చు.

ప్రీ-బుకింగ్ ఎప్పుడంటే?

ప్రీ-బుకింగ్ ఎప్పుడంటే?

JioPhone Next ప్రీ-బుకింగ్స్ వచ్చేవారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ ఫోన్లు, దీనికి సంబంధించిన ఇతర పరికరాలు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లోను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు రిలయన్స్ ప్రయత్నాలు చేస్తోందట. ఈ మేరకు వివో, షావోమీ, శాంసంగ్, ఒప్పో, HMD గ్లోబల్, ఐటెల్ సహా మరిన్ని రిటైల్ స్టోర్స్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయా స్టోర్స్‌లో జియో మినీ పాయింట్ ఏర్పాట్లు చేయనున్నారని సమాచారం. ఈ క్రమంలో రిటైలర్స్‌కు కూడా కమిషన్ ఇవ్వనున్నారు.

ఫోన్ ధర ఎంత?

ఫోన్ ధర ఎంత?

JioPhone Next స్మార్ట్ ఫోన్‌కు సంబంధించినవిగా చెబుతోన్న ఫీచర్స్ కొన్ని ఇటీవలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా దీని ధరకు సంబంధించి కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రిలయన్స్ జియో నుండి అధికారిక ప్రకటన రాలేదు. కానీ దీని ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అత్యంత సరసమైన ఫోన్‌గా మాత్రం రిలయన్స్ జియో చెబుతోంది. ఇది కేవలం భారత్‌లోనే అత్యంత చౌకైన ఫోన్ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఇది తక్కువ ధర కలిగిన ఫోన్‌గా చెబుతున్నారు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

JioPhone Next స్పెసిఫికేషన్స్ పైన నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ 11 (GO ఎడిషన్), 5.5 ఇంచుల HD డిస్‌ప్లే, క్వాల్‌కామ్ QM215 SoC ఉంటాయని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2GB, 3GB ర్యామ్ కలిగి ఉండి, eMMC 4.5 స్టోరేజ్ ఆప్షన్స‌ 16GB, 32GB స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోటోలు, వీడియోల కోసం బ్యాక్ సైడ్ 13 మెగా పిక్సెల్స్ కెమెరా సెన్సార్ కలిగి ఉందట. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉందని చెబుతున్నారు. 2,500mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తోందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్ v4.2, జీపీఎస్ కనెక్టివిటీ, గూగుల్ అసిస్టెంట్, స్క్రీన్ రీడర్, లాంగ్వేజ్ ట్రాన్సులేటర్స్ ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే JioPhone Next సిస్టమ్ వైడ్ రీడ్ అలౌడ్, ట్రాన్సులేట్ నౌ ఫీచర్ కలిగి ఉంటుందని జియో ధృవీకరించింది. ఇది గూగుల్ అసిస్టెంట్, ఫోన్ కెమెరాలోని ఇండియా-స్పెసిఫిక్ స్నాప్‌చాట్ లెన్సెస్‌తో అనుసంధానం కలిగి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ JioPhone Nextను జూన్ నెలలో జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఆవిష్కరించారు.

English summary

గుడ్‌న్యూస్: వచ్చే వారమే JioPhone Next, ధర, ఫీచర్స్ ఇవేనా? | JioPhone Next pre bookings to open next week

JioPhone Next, the extremely affordable smartphone developed by Reliance Jio and Google, will be available for pre-booking from next week, according to a report. This will be days before the phone breaks cover in the second week of September.
Story first published: Friday, August 27, 2021, 20:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X