For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్, ఏప్రిల్ 17 వరకు ఇవి ఉచితం: ఇలా సులభంగా రీఛార్జ్ చేయండి..

|

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల రీఛార్జ్ ఆన్‌లైన్ ద్వారా మినహా కస్టమర్ సర్వీస్ సెంటర్స్, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్స్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్‌టెల్ గడువు పొడిగించడంతో పాటు రూ.10 అదనపు టాక్ టైమ్ ఇచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.

BSNL, ఎయిర్‌టెల్ ఆఫర్: రూ.10 సహా ప్రీపెయిడ్ గడువు పొడిగింపుBSNL, ఎయిర్‌టెల్ ఆఫర్: రూ.10 సహా ప్రీపెయిడ్ గడువు పొడిగింపు

ఏప్రిల్ 17 వరకు జియో ఇవి ఉచితం

ఏప్రిల్ 17 వరకు జియో ఇవి ఉచితం

లాక్ డౌన్ కొనసాగుతోన్నందున టెల్కకోలు తమ కస్టమర్లకు వరుసగా ఊరటను ఇచ్చే చర్యలు చేపడుతున్నాయి. రిలయన్స్ జియో తమ యూజ‌ర్ల‌కు ఏప్రిల్ 17వ తేదీ వరకు 100 నిమిషాల కాల్స్, 100 సందేశాలను ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుకునే వెసులుబాటు కల్పించింది.

ప్రీపెయిడ్ వ్యాలిడిటీ అయిపోయినా పొడిగింపు

ప్రీపెయిడ్ వ్యాలిడిటీ అయిపోయినా పొడిగింపు

అలాగే, ప్రీపేయిడ్ వ్యాలిడిటీ అయిపోయినప్పటికీ లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్‌క‌మింగ్ కాల్స్ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ అత్య‌వ‌స‌ర సమయంలో తమ బంధువులు, స్నేహితులతో మాట్లాడుకోవ‌టానికి ఒకవేళ అవసరమైతే హెల్త్ కేర్ సర్వీసులు పొందడానికి ఇది ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.

ఇలా ఈజీగా రీఛార్జ్ చేసుకోండి..

ఇలా ఈజీగా రీఛార్జ్ చేసుకోండి..

లాక్ డౌన్ కొనసాగుతున్నందున్న ఆఫ్‌లైన్ ద్వారా రీచార్జ్ చేసుకునే జియో కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ జియో తన ప్రకటనలో తెలిపింది. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్ ద్వారా కూడా జియో కస్టమర్లు సులువుగా రీచార్జ్ చేసుకోవచ్చని సూచించింది.

యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు ఎస్సెమ్మెస్ బ్యాకింగ్ ద్వారా కూడా రీచార్జ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు ట్రాయ్ ఇటీవల ఆదేశించింది.

English summary

కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్, ఏప్రిల్ 17 వరకు ఇవి ఉచితం: ఇలా సులభంగా రీఛార్జ్ చేయండి.. | Jio to provide 100 minutes calling, 100 SMSs for free till 17 April

Reliance Jio has announced complimentary 100 minutes of calls and 100 text messages till 17 April. The company has also announced that users will continue to receive incoming calls even after their validity expires.
Story first published: Wednesday, April 1, 2020, 8:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X