For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియోలో సౌదీ కంపెనీ భారీ పెట్టుబడి, రూ.1,15,694 కోట్లు సమీకరణ

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలోకి 9 వారాల్లో 11వ పెట్టుబడి వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచ అతిపద్ద సావరీన్ వెల్త్ ఫండ్ PIF రూ.11,367 కోట్ల పెట్టుబడితో 2.32 శాతం వాటాను దక్కించుకుంటోంది. తాజా వాటా విక్రయంతో జియో ప్లాట్‌ఫాంలో రిలయన్స్ 24.70 శాతం వాటాను విక్రయించినట్లయింది. అలాగే రూ.1,15,693.95 కోట్లు సమీకరించింది.

రిలయన్స్ జియోలోకి పెట్టుబడులు వెల్లువ.. మరిన్ని కథనాలు

వరుస పెట్టుబడుల వెల్లువ

వరుస పెట్టుబడుల వెల్లువ

రూ.4.91 లక్షల కోట్ల ఈక్విటీ వ్యాల్యూ, రూ.5.16 లక్షల కోట్ల ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూ వద్ద PIF ఈ పెట్టుబడులు పెట్టింది. ఏప్రిల్ 22వ తేదీన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ రూ.43,574 కోట్లు ఇన్వెస్ట్ చేసి, 9.99 శాతం వాటాను దక్కించుకుంది. అప్పటి నుండి వరుసగా ఇది పదకొండో పెట్టుబడి. ఓ కంపెనీ రెండుసార్లు ఇన్వెస్ట్ చేసింది. ఫేస్‌బుక్ తర్వాత వివిధ అంతర్జాతీయ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. PIF 1971లో స్థాపించబడిన సంస్థ. 400 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అతిపెద్ద సావరీన్ వెల్త్ ఫండ్స్‌లో ఒకటిగా ఉంది.

సౌదీ తరఫున పెట్టుబడుల కోసం PIF

సౌదీ తరఫున పెట్టుబడుల కోసం PIF

సౌదీ అరేబియా తరఫున పెట్టుబడులు పెట్టడం కోసం 1971లో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF)ను స్థాపించారు. సౌదీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో పీఐఎఫ్ పాత్ర ఎంతో ఉందని, అలాగే వేగవంతమైన డిజిటల్ దిశగా భారత్‌ను తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఇండియాలో డిజిటల్ టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కిస్తున్న జియోలో పెట్టుబడులు పెట్టడం ఆనందంగా ఉందని పీఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్ రుమయ్యన్ తెలిపారు. కాగా, 2021 మార్చి నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఇందుకోసం జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలు విక్రయించడంతో పాటు ముప్పై ఏళ్ల తర్వాత ఇటీవల రైట్స్ ఇష్యూకు వెళ్లింది.

11 వరుస పెట్టుబడులు

11 వరుస పెట్టుబడులు

- ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా

- సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా

- విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా

- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా

- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా

- ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా

- TPG - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా

- ఎల్-కేటర్టన్ - రూ.1,894.50 కోట్లు - 0.39 శాతం వాటా

- PIF - రూ.11,367 కోట్లు - 2.32 శాతం వాటా

English summary

జియోలో సౌదీ కంపెనీ భారీ పెట్టుబడి, రూ.1,15,694 కోట్లు సమీకరణ | Jio Platforms gets 11th investor as Saudi Arabia's PIF joins rush for RIL unit

Saudi Arabia’s PIF, one of the world’s largest sovereign wealth funds, will invest Rs 11,367 crore for 2.32 percent of Jio Platforms, a historic eleventh investment in the Reliance Industries (RIL) digital unit in nine weeks.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X