జెట్ ఎయిర్వేస్ ఎగరడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్,యూఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ కన్సార్టియం సమర్పించిన దివాలా పరిష్కార ప్రణాళికకు జెట్ ఎయిర్వేస్ రుణ సంస్థల కమిటీ అంగీకారం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతో నరేష్ గోయల్ నేతృత్వంలోని జెట్ ఎయిర్వేస్ సేవలు గత ఏడాది నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పునరుజ్జీవం లభిస్తోంది. ఎయిర్ లైన్స్ విమానాలు కొత్త రెక్కలు తొడిగి త్వరలో టేకాఫ్ కానున్నాయి.

కొత్త యాజమాన్యం చేతుల్లోకి
దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జెట్ ఎయిర్వేస్ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. కల్రాక్ క్యాపిటల్, మురారీ లాల్ జలాన్ కన్సార్టియం సమర్పించిన దివాలా పరిష్కార ప్రణాళికకు జెట్ ఎయిర్వేస్ రుణదాతల కమిటీ(COC) ఆమోదం తెలిపింది. శనివారం ఈ-ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. కన్సార్టియం బిడ్‌ను CoC ఆమోదించినట్లు జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార నిపుణులు (రిజల్యూషన్ ప్రొఫెషనల్-RP) ఆశీష్ చావ్‌చారియా తెలిపారు.

రూ.850 కోట్ల ఆఫర్
జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్(NCLT) ఆమోదం లభించాల్సి ఉంది. ఎన్సీఎల్టీ ఆమోదం కోసం సెక్షన్ 30(6) కింద దరఖాస్తులు పంపే యోచనలో ఉన్నారు. అనంతరం పౌరవిమానయానం, కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. కల్రాన్-జలాన్ కన్సార్టియం బిడ్‌లో భాగంగా బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ వాటాతో పాటు రూ.850 కోట్లు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రెండు బిడ్స్ దాఖలయ్యాయి. ఇందులో ఈ బిడ్‌కు ఆమోదం లభించింది.

క్లెయిమ్.. ఆర్బీ అంగీకరించిన బకాయిలు
జెట్ ఎయిర్వేస్‌కు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, థర్డ్ పార్టీ సేవలు అందించిన ఆపరేషనల్ క్రెడిటార్లు, ఉద్యోగులు క్లెయిమ్ చేసిన మొత్తం బకాయిలు రూ.40,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇందులో RP అంగీకరించిన బకాయిలు రూ.15,525 కోట్లకు పైగా ఉంటాయి. రుణదాతల్లో ఎస్బీఐ, యస్ బ్యాంకు రూ.11,3444 కోట్లు క్లెయిమ్ చేయగా, రూ.7,460 కోట్లకు మాత్రమే RP ఆమోదం తెలిపింది. ఈ లెక్కన రుణాలిచ్చిన బ్యాంకులకు రికవరీలో గండి పడనుంది. సంస్థలో 22వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications