For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్, అమలుకు 90 రోజుల గడువు

|

ఆర్థిక సమస్యలతో రెండేళ్ల క్రితం మూతబడిన జెట్ ఎయిర్‌వేస్ మళ్ళీ ఎగరనుంది. ప్రయివేట్ ఎయిర్ లైన్స్ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జలాన్-కల్రాక్ కన్సార్టియం సమర్పించిన బిడ్‌కు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్(NCLT) ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22వ తేదీ నుండి 90 రోజుల్లో పరిష్కార ప్రణాళికను అమలు చేయాలని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అమలుకు మరింత సమయం అవసరమైతే జలాన్-కల్రాక్ కన్సార్షియం ట్రైబ్యునల్‌ను సంప్రదించవచ్చని తెలిపింది.

ఈ కన్సార్షియం బిడ్‌కు ఎయిర్‌లైన్స్ రుణదాతల కమిటీ (COC) గత ఏడాది అక్టోబర్ నెలలోనే ఆమోదం తెలిపింది. రుణ సంక్షోభం వల్ల 2019 ఏప్రిల్ 17వ తేదీ నుండి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వ కన్సార్షియం రూ.8,000 కోట్లకు పైగా బకాయిలను రాబట్టుకోవడానికి 209 జూన్‌ నెలలో దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది.

Jet Airways Revival Plan by bankruptcy court

ఇదిలా ఉండగా, జెట్‌ ఎయిర్‌వేస్‌కు గతంలో ఉన్న స్లాట్స్ ఆధారంగా మళ్లీ కేటాయించాలనే ఆదేశాలు జారీ చేయడం లేదని ఎన్సీఎల్టీ పేర్కొంది. ఆ విషయంలో ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని స్పష్టం చేసింది. కార్యకలాపాలు నిలవడానికి ముందు వివిధ విమానాశ్రయాల్లో ఈ సంస్థకు ఉన్న స్లాట్స్‌ను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించారు.

English summary

మళ్లీ ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్, అమలుకు 90 రోజుల గడువు | Jet Airways Revival Plan by bankruptcy court

NCLT has approved revival plan submitted by Kalrock Jalan consortium plan.
Story first published: Wednesday, June 23, 2021, 7:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X