ఢిల్లీ: అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారత్‌లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతానని ప్రకటించారు. మన కరెన్సీలో రూ.7,100 కోట్లు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన అమెజాన్ సంభవ్ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ కలిగిన మేకిన్ ఇండియా ఉత్పత్తులను అమెజాన్ ఎగుమతి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. భారత్-అమెరికా మధ్య మరింత సంఖ్యత ఉండాల్సిన అవసరముందన్నారు.

7వేల కోట్ల పెట్టుబడిపై వ్యాపారుల ఆగ్రహం
భారత్‌లో రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని జెఫ్ బెజోస్ చేసిన ప్రకటనపై అఖిల భారత వర్తక వ్యాపారుల సమాఖ్య(CAIT) మండిపడింది. భారత్‌లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కొల్లగొట్టేందుకు అమెజాన్ ప్రయత్నాలు చేస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తింది. కేవలం వారి ప్రమోషన్ కోసమే తాజా పెట్టుబడుల నిర్ణయాన్ని వెల్లడించారని విమర్శించారు.

జెఫ్ గో బ్యాక్ అంటూ నినాదాలు
ఇండియా నిబంధనలను అతిక్రమిస్తూ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్ ఇచ్చే భారీ డిస్కౌంట్ల కారణంగా చిరు వ్యాపారులు ఉపాధిని కోల్పోతున్నారని CAIT ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా జెఫ్ బెజోస్ రాకను నిరసిస్తూ బుధవారం నుంచి నిరసనలు చేపడుతోంది. జెఫ్ బెజోస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

మేం వారితో పోటీ పడలేం..
మేం వారితో పోటీ పడలేమని, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటి ద్వారా అనారోగ్యకరమైన పోటీ నెలకొందని ఓ వ్యాపారి అన్నారు. గత రెండేళ్లలో తమ అమ్మకాలు 15 శాతం కంటే ఎక్కువగా తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ డిస్కౌంట్ల కారణంగా వినియోగదారులు ఆన్ లైన్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

120 బిలియన్ డాలర్ల మార్కెట్
మరోవైపు, తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు 5,50,000 మంది సెల్లర్స్‌కు తమ ప్లాట్ ఫాం ద్వారా అవకాశం కల్పిస్తున్నామని అమెజాన్ చెబుతోంది. భారత ఈ-కామర్స్ మార్కెట్ ఈ ఏడాదికి 120 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా. 2017-2020 మధ్య ఈ వృద్ధి 51 శాతంగా ఉండటం ఉంటుందని ఓ సర్వే అంచనా.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications