For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Infosys: చెప్పలేనంత ఆనందంలో ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. డబుల్ హైక్.. సూపర్ డెసిషన్..

|

Infosys: చాలా కాలంగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇన్ఫోసిస్ చెప్పిన వార్తతో ఉద్యోగుల్లో సంతోషం ఉప్పొంగుతోంది. అన్ని కంపెనీల మాదిరిగా కాకుండా సంస్థ మంచి హైక్ ప్రకటించటంతో టెక్కీలు తెగ సంతోషంగా ఉన్నారు.

జీతాల పెంపు ఇలా..

జీతాల పెంపు ఇలా..

ఐటీ సేవల దిగ్గజం తన ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో వారి పనితీరుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. తన మెుత్తం ఉద్యోగుల్లో ఎక్కువ మందికి 10-13% వరకు జీతాల పెంపును ప్రకటించింది. అయితే అత్యుత్తమ పనితీరు కనబరిచిన కొదరికి మాత్రం 20-25% హైక్ అందించింది. బెస్ట్ పర్ఫామర్స్ కి డబుల్ బోనస్ అందించటం పట్ల టెక్కీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఖర్చులు తగ్గిస్తూ..

ఖర్చులు తగ్గిస్తూ..

దేశంలోనే రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజంగా ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మంచి వేతన పెంపును ప్రకటిస్తూనే.. ఆన్-సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, వినియోగ స్థాయిలను పెంచడం వంటి పద్ధతుల్లో ఖర్చులను తగ్గించుకుంటోంది. జీతాల పెంపుదల ఉద్యోగి గ్రేడ్‌లపై ఆధారపడి ఉంటుందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ క్రిష్ శంకర్ అన్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్ తక్కువ హైక్ అందుకుంటారని అన్నారు.

అట్రిషన్ విషయంలో..

అట్రిషన్ విషయంలో..

జూన్ FY23 త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ 28.4 శాతంగా ఉంది. ఇది ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఎక్కువ. ఉద్యోగుల కెరీర్ గ్రోత్ పెంచడానికి వేగవంతమైన, మరింత ఊహాజనిత ప్రమోషన్‌లు, రోల్ రొటేషన్‌లు, డెడికేటెడ్ ప్రోగ్రామ్‌లను ఉద్యోగులకు అందించేందుకు కంపెనీ అనేక చర్యలు తీసుకుంది.

పెరిగిన ప్రమోషన్లు..

పెరిగిన ప్రమోషన్లు..

ఐదేళ్ల కిందట ఏడాదికి 8,000-10,000 మంది ఉద్యోగులకు కంపెనీ ప్రమోషన్స్ ఇచ్చేంది. అయితే 2021-22లో కంపెనీ వార్షికంగా 40,000 ప్రమోషన్‌లను ఇస్తోంది. ఇప్పుడది ఇంకా పెరగవచ్చని గ్రూప్ హెచ్‌ఆర్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. ప్లాటినం క్లబ్ ఆఫ్ టాప్ పెర్ఫార్మర్స్ ద్వారా ఫ్రెషర్ స్థాయి నుంచి మేనేజర్ స్థానానికి చేరుకోవడానికి పట్టే కాలాన్ని తగ్గించే లక్ష్యంతో కంపెనీ ముందుకెళుతున్నట్లు ఆయన గతంలోనే తెలిపారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో 1-2 శాతం మంది ఇప్పుడు ప్లాటినం క్లబ్‌లో భాగమయ్యారు.

Read more about: infosys it jobs salary hikes
English summary

Infosys: చెప్పలేనంత ఆనందంలో ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. డబుల్ హైక్.. సూపర్ డెసిషన్.. | IT Jaint Infosys giving double hike in salary to top performers

IT Jaint Infosys giving double hike in salary to top performers
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X