For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gratuity: గ్రాట్యుటీ పొందాలంటే 5 సంవత్సరాలు పని చేయాల్సిందేనా..!

|

పది మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి, ఐదేళ్లపాటు నిరంతరం సేవలు అందించిన తర్వాత గ్రాట్యుటీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 చెబుతోంది. అంటే ఒక ఉద్యోగి ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పని చేస్తే, అటువంటి పరిస్థితిలో అతను గ్రాట్యుటీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

5 సంవత్సరాలు పూర్తు కాకుండానే

5 సంవత్సరాలు పూర్తు కాకుండానే

ఈ మొత్తాన్ని ఉద్యోగి పదవీ విరమణ లేదా ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు తీసుకోవచ్చు.గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం ఒక వ్యక్తి ఒక కంపెనీలో 5 సంవత్సరాలు నిరంతరాయంగా పని చేయకుంటే గ్రాట్యుటీ పొందలేరు. అయితే 5 సంవత్సరాల వ్యవధిని పూర్తి చేయకుండానే, ఉద్యోగి గ్రాట్యుటీ మొత్తాన్ని పొందవచ్చు. కానీ కొన్నినియమాలు ఉన్నాయి.

మరణిస్తే

మరణిస్తే

ఒక ఉద్యోగి ప్రమాదం కారణంగా మరణిస్తే అలాంటి పరిస్థితుల్లో గ్రాట్యుటీ మొత్తాన్ని పొందవచ్చు. అంతే కాకుండా

ఒక ఉద్యోగి ప్రమాదంలో అంగవైకల్యం పాలై.. మళ్లీ పని చేయలేకపోతే అతను గ్రాట్యుటీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగంలో చేరేటప్పుడు, కంపెనీ ప్రతి ఉద్యోగికి ఫారమ్ ఎఫ్ ఇస్తుంది. దీని తర్వాత మీరు గ్రాట్యుటీని క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఫిక్స్‌డ్ టర్మ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు

ఫిక్స్‌డ్ టర్మ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు

మరోవైపు ఫిక్స్‌డ్ టర్మ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక ఏడాది సర్వీస్ అందించిన తర్వాత గ్రాట్యుటీ క్లెయిమ్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ప్రైవేట్ ఉద్యోగులు ఒక ఏడాది సర్వీస్ పూర్తి కాగానే గ్రాట్యుటీని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

English summary

Gratuity: గ్రాట్యుటీ పొందాలంటే 5 సంవత్సరాలు పని చేయాల్సిందేనా..! | It is possible to get gratuity without working for 5 years

The Payment of Gratuity Act, 1972 states that an employee working in a private company having more than ten employees can claim gratuity benefits after five years of continuous service.
Story first published: Saturday, February 4, 2023, 11:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X