For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెల్లగా పరిస్థితులను కంట్రోల్ లోకి తెచ్చుకుంటున్న ఐటీ కంపెనీలు.. టెక్కీల డబుల్ గేమ్ ఫినిష్.. రోజువారీ కూలీగా..

|

IT News: ఇటీవల ఐటీ కంపెనీల్లో చాలా కొత్త నిబంధనలు వస్తున్నాయి. పరిస్థితులను పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు టెక్ కంపెనీలు రూటు మార్చాయి. ఆ క్రమంలో విప్రో 300 మంది మాట వినని ఉద్యోగులను తొలగించటం చాలా పెద్ద దుమారం రేపుతోంది. దీనికి తోడు కంపెనీ క్రమశిక్షణను పెంచేందుకు తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుంది.

విప్రో ప్రకటన..

విప్రో ప్రకటన..

ఎలాగైనా మూన్‌లైటింగ్ కు చెక్ పెట్టాలని భావించిన విప్రో తమ ఉద్యోగులకు హైబ్రిడ్ విధానాన్ని అమలులోకి తెస్తోంది. దీని ప్రకారం ఇకపై టెక్కీలు వారానికి మూడు రోజుల పాటు తప్పకుండా కార్యాలయాలకు రావలసి ఉంటుంది. దీనిని అక్టోబర్ 10 నుంచి అమలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బందికి సమాచారం కూడా అందించింది.

మెయిల్ సమాచారం..

మెయిల్ సమాచారం..

కనీసం 4 రోజులలో 3 రోజులు ఆఫీసు నుండి పని చేయవలసిందిగా కంపెనీ ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. దీనివల్ల టీమ్ వర్క్, ఫ్లెండ్లీ నేచర్ ను ఉద్యోగులు ఆస్వాధించగలరని విప్రో తెలిపింది. గత నెలలో ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కూడా ఇదే తరహాలో ఉద్యోగులను ఆఫీసులకు తప్పక రావలసిందేనని తేల్చి చెప్పింది. టెక్ మహీంద్రా కూడా ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరింది.

రిటర్న్ టు ఆఫీస్ పాలసీ..

రిటర్న్ టు ఆఫీస్ పాలసీ..

రిటర్న్ టు ఆఫీస్ పాలసీ కింద కంపెనీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అవలంబిస్తుంది. లీడర్‌షిప్ రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు అక్టోబర్ 10 నుంచి ఆఫీసులకు తిరిగి వస్తారని వెల్లడించింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో కార్యాలయాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. దీనివల్ల మూన్‌లైటింగ్ సమస్యకు త్వరగా పరిష్కారం దొరుకుతుందని కంపెనీ భావిస్తోంది.

TCS..

TCS..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న TCS కార్యాలయాలను వినియోగదారులు సందర్శిస్తున్నారని కంపెనీ తెలిపింది. అందువల్ల ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాలని కోరింది. ఇదే సమయంలో సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

రోజువారీ కూలీలుగా టెక్కీలు..

రోజువారీ కూలీలుగా టెక్కీలు..

చాలా కంపెనీలు ఎంపిక చేసుకున్న ఉద్యోగులను సైతం రిజెక్ట్ చేస్తున్నాయి. తాజాగా డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ విద్యార్థిని కూడా చెల్లించని రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం విప్రో ఎంపిక చేసింది. అలా విప్రోలో ఉద్యోగానికి సెలక్ట్ అయ్యి రవి అనే బీటెక్ విద్యార్థి పొట్టకూటి కోసం రూ.300 కూలీకి నిర్మాణ పనులకు వెళుతున్నాడు. జాబ్ ఆఫర్ వచ్చి నెలరోజులైంది. కానీ తనకు ఇంకా ఉద్యోగం రాలేదని రవి నిరాశలో ఉన్నాడు. రవి లాగా చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మనీ కంట్రోల్ వార్తా సంస్థ ఒక కథనంలో వెల్లడించింది.

English summary

మెల్లగా పరిస్థితులను కంట్రోల్ లోకి తెచ్చుకుంటున్న ఐటీ కంపెనీలు.. టెక్కీల డబుల్ గేమ్ ఫినిష్.. రోజువారీ కూలీగా.. | it Giant wipro informed its employees to work from office 3 days in a week with hybrid model

it Giant wipro informed its employees to work from office 3 days in a week with hybrid model
Story first published: Wednesday, October 5, 2022, 10:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X