కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగాల కోత లేదా వేతన కోతకు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ కంపెనీలపై కూడా భారీ ప్రభావం పడింది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో పెద్దగా ఉద్యోగాల కోత లేనప్పటికీ, ఓపెనింగ్స్ మాత్రం అంతగా ఉండవని చెబుతున్నాయి. అయితే బిజినెస్ లేక.. ఆదాయం లేక చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరిన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. దీనిపై ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లింది.

సీఎం గారూ.. జోక్యం చేసుకోండి
కరోనా సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుకు, వేతన కోతకు పాల్పడుతున్నారని చెబుతూ ఐటీ ఉద్యోగుల యూనియన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాసింది. ఐటీ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. మహారాష్ట్ర వ్యాప్తంగా పలు ఐటీ, అనుబంధ కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయని, వేతనాలు ఇవ్వకుండా కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని జాతీయ ఐటీ ఎంప్లాయీస్ సెనెట్ (NITES) సీఎంకు లేఖ రాసింది.

ఆదేశాలు జారీ చేయాలి
ఉద్యోగాల కోత లేదా వేతన కోత అంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని NITES తెలిపింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉద్యోగుల హక్కులని కాపాడేలా ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలని NITES ప్రధాన కార్యదర్శి హర్‌ప్రీత్ సలుజా అన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు. చాలా IT/ITeS/BPO/KPO కంపెనీలు ఉద్యోగాల కోత, వేతన కోతకు పాల్పడుతున్నాయన్నారు.

ఉద్యోగులు బలవుతున్నారు
మహారాష్ట్రలోని ఆరు లక్షల మంది IT/ITeS/BPO/KPO ఉద్యోగులు, వారి కుటుంబాలను కాపాడేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులోను ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కోరారు. ప్రస్తుత మహమ్మారితో ఉద్యోగులకు సంబంధం లేదని, కానీ అయినప్పటికీ వారే బలి కావాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగం కోల్పోతున్నారని, రోజువారీ ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

68,000 మంది పిటిషన్
చాలామంది ఉద్యోగులకు కనీసం నోటీసు పీరియడ్ ఇవ్వలేదని, ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడం, కంపన్షేషన్ చెల్లింపులు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి కార్మిక విధానాలు కూడా అవలంభించడం లేదని తెలిపారు. ఈ లేఖను తాము మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించామని, తమకు రసీదు అందిందని NITES తెలిపింది. దాదాపు 68,000 మంది ఉద్యోగులు అక్రమ తొలగింత, వేతనాల్లో కోత, ఎర్న్డ్ లీవ్స్ డిడక్షన్, బలవంతపు రాజీనామా సహా వివిధ రకాల పిటిషన్లను లేబర్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారని తెలిపారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications