For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు ఈ క్వార్టర్‌లో మరింత గండం

|

కరోనా మహమ్మారి కారణంగా ఐటీ, బీపీవో రంగాలపై భారీ ప్రభావం పడిందని, వేలాదిమంది ఉద్యోగాలు పోవడంతో పాటు, అంతకు రెట్టింపు సంఖ్యలో వేతనం లేని సెలవుల్లో ఉండాల్సిన పరిస్థితులు అని ఇండస్ట్రీ వర్గాల అంచనా. కరోనా ప్రభావం ఇతర రంగాల కంటే ఐటీపై కాస్త తక్కువగా కనిపించింది. అయినప్పటికీ వేలాది ఉద్యోగాలు పోయాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఐటీ, బీపీవో రంగాల్లో భారీగా ఉద్యోగాలు పోవచ్చునని అంచనా వేస్తున్నారు.

30,000 ఉద్యోగాలు పోయి ఉండవచ్చు

30,000 ఉద్యోగాలు పోయి ఉండవచ్చు

కరోనా మహమ్మారి కారణంగా ఐటీ, బీపీవో, అనుబంధ రంగాల్లో 30,000 మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని ఇండస్ట్రీ వర్గాల అంచనా. అలాగే వేతనం లేని సెలవుల్లో 60,000 మంది వరకు ఉంటారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చిన్న, మధ్యస్థాయి ఐటీ, బీపీఓ కంపెనీలపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని చెబుతున్నారు. ఇండియాలోని ఐటీ, బీపీవో కంపెనీల్ల్లో 43.6 లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 0.68% వరకు ఉద్యోగాల కోత ఉంటుందని భావిస్తున్నారు. అయితే రెండో క్వార్టర్‌లో మరింత ఎక్కువగా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

అప్పుడే ప్రారంభమైన స్టార్టప్స్‌పై దెబ్బ

అప్పుడే ప్రారంభమైన స్టార్టప్స్‌పై దెబ్బ

ఐటీ, బీపీవో, అనుబంధ రంగాల్లో 25,000 నుండి 30,000 ఉద్యోగ నష్టాలు ఉన్నాయని, ఈ ఉద్యోగ నష్టాలు చాలావరకు సూక్ష్మ, చిన్న మధ్యతరహా క్లయింట్స్ ఖర్చులు తగ్గించుకున్నాయని దీంతో 50వేల నుండి 60వేల మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన చాలా స్టార్టప్స్ పైన ప్రభావం పడిందని, దీంతో ఉద్యోగ నష్టాలకు దారి తీసిందని చెబుతున్నారు. జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌లో మరింత ఒత్తిడి పెరిగి, ఉద్యోగ నష్టాలు ఉంటాయని భావిస్తున్నారు.

ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి

ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి

కరోనా దెబ్బకు అంతర్జాతయంగా అనిశ్చితి పెరిగింది. క్లయింట్స్... ఐటీ వ్యయాల్ని వాయిదా తగ్గించుకోవడం లేదా వాయిదా వేయడం చేస్తున్నాయి. ఈ ప్రభావం ఐటీ సెక్టార్ పైన పడింది. మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో టెక్నాలజీ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. దీంతో ఈ క్వార్టర్‌లో ఉద్వాసనలు పెరుగుతాయని భావిస్తున్నారు. బెంచ్‌పై ఉన్న వారిని లేదా పనితీరు సరిగాలేని వారిని తొలగించడం లేదా సెలవుపై ఇంటికి పంపిస్తున్నాయి. బీపీవోలు అయితే ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. డిజిటల్ మార్ు కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు.

వ్యయ నియంత్రణ

వ్యయ నియంత్రణ

ఐటీ కంపెనీలకు ఆదాయం తగ్గడంతో వ్యయ నియంత్రణను కూడా చేపడుతున్నాయని భావిస్తున్నారు. ఐటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పనితీరు ఆధారంగా ప్రతి ఏడాది ఉన్నట్లుగానే తొలగింపులు ఉంటాయని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. ఇది సాధారణ ప్రక్రియనే అంటున్నాయి. ఐటీ కంపెనీల వ్యయాల్లో ఉద్యోగుల వేతనాల వాటా ఎక్కువ. దీంతో సీనియర్, మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ వేతనాల్లో కోతలు పడ్డాయి.

English summary

వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు ఈ క్వార్టర్‌లో మరింత గండం | IT, BPO sectors lose 30,000 jobs, likely to let go of more

The COVID-19 pandemic has led to about 30,000 jobs being lost in the IT and BPO sectors in India, with 60,000 being sent on leave without pay.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X