For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇక ఈ పేమెంట్స్ చేయలేరు..

|

Credit Card: నగదు రహిత లావాదేవీలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. రానున్న మూడేళ్లలో రోజువారీ పేమెంట్స్ లో సగం డిజిటల్ చెల్లింపులేనని నివేదికలు బలంగా చెబుతున్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగం ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతోంది. బీమా చెల్లింపుల నుంచి వివిధ రకాల వ్యాపార లావాదేవీల వరకు వినియోగదారులు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి అతి త్వరలో బ్రేక్ పడనుంది.

బీమా పాలసీపై తీసుకున్న లోన్ల తిరిగి చెల్లింపు విధానంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తరహా లావాదేవీల్లో క్రెడిట్ కార్డ్‌ ద్వారా పేమెంట్ చేసే ఆప్షన్ నిలిపివేయాలని అన్ని జీవిత బీమా సంస్థలను ఉద్దేశించి సర్క్యులర్‌ విడుదల చేసింది. ఈ సూచనను వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశించింది.

IRDAI ordered to remove credit card payment option for insurance policy loans

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్, 1999లోని సెక్షన్ 14 కింద ఈ సర్క్యులర్ ను IRDAI జారీ చేసింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కూడా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) టైర్-II ఖాతాలలో సబ్‌స్క్రిప్షన్‌లు మరియు కాంట్రిబ్యూషన్‌ల కోసం క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఆమోదించడాన్ని నిలిపివేస్తున్నట్లు ఆగస్టు 2022లో ప్రకటించింది.

అప్పు తీసుకోవడమే పరమావధి అన్నట్లు అంతగా అవసరం లేకున్నా భీమా పాలసీపై కస్టమర్లు రుణాలకు వెళ్తున్నట్లు IRDAI గుర్తించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ పేపర్‌ లెస్‌ గా ఉండటంతో చాలా సులభంగా ఈ లోన్లు ఆమోదం పొందుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో మిక్కిలి ఉపయోగకరమైన ఎంపికను తక్షణ అవసరాల కోసం ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ దృష్టికి వెళ్లనట్లు భావిస్తున్నారు. దీనికితోడు వివిధ కారణాల రీత్యా IRDAI ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుకోవచ్చు.

English summary

Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇక ఈ పేమెంట్స్ చేయలేరు.. | IRDAI ordered to remove credit card payment option for insurance policy loans

IRDAI ordered to remove credit card payment option for insurance policy loans..
Story first published: Saturday, May 6, 2023, 8:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X