For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Metro Brands IPO: మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

|

ముంబై: దేశంలో స్టాక్ మార్కెట్లు, షేర్ల లావాదేవీలతో పెట్టుబడులు పెట్టేవారికి చిర పరిచితమైన పేరు.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కోట్ల రూపాయలను ఆర్జించిన స్టార్ ఇన్వెస్టర్. 99 శాతం ఖచ్చితమైన అంచనాలతో ఆయన షేర్ మార్కెట్ గురించి విశ్లేషణలు చేస్తుంటారు. ఆయనను అనుసరించే చిన్నస్థాయి ఇన్వెస్టర్లు, రిటైల్ మదుపరులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన షేర్లల్లో తాము కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

డిజాస్టర్‌గా

డిజాస్టర్‌గా

ఆయనకు చెందిన సంస్థల పబ్లిక్ ఇష్యూలను కొనుగోలు చేస్తుంటారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటికే పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేసింది. ఈ నెల 2వ తేదీన దాని గడువు ముగిసింది కూడా. స్టాక్ మార్కెట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు మొదట్లో అంచనా వేశాయి గానీ.. దాని పూర్తి వివరాలు వెల్లడయిన తరువాత డిజాస్టర్‌గా మారింది.

ప్రైస్ బ్యాండ్ అధికంగా..

ప్రైస్ బ్యాండ్ అధికంగా..

నవంబర్ 30వ తేదీన ఓపెన్ అయిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఐపీఓ.. ఈ నెల 2వ తేదీన ముగిసింది. 870 నుంచి 900 రూపాయల ప్రైస్‌బ్యాండ్‌తో మార్కెట్‌లోకి వచ్చిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేర్ల పట్ల ఇన్వెస్టర్లు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. దాని వైపు కన్నెత్తి చూడలేదు. వందశాతం సబ్‌స్క్రిప్షన్‌ను నమోదు చేయడంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ విఫలమైంది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) కనీసం 10 శాతం కూడా దాటలేదంటే అది ఏ స్థాయిలో ఫెయిల్యూర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో 150 రూపాయలుగా నమోదైన జీఎంపీ.. క్రమంగా ఏడు రూపాయలకు క్షీణించింది.

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఝున్‌ఝున్‌వాలా..

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఝున్‌ఝున్‌వాలా..

ఇప్పుడు తాజాగా రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. అదే మెట్రో బ్రాండ్స్ (Metro Brands IPO). పాదరక్షలకు చెందిన కంపెనీ ఇది. ఫుట్‌వేర్ రిటైలర్ దిగ్గజ కంపెనీగా పేరుంది మెట్రో బ్రాండ్స్‌కు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG)కు చెందిన సెగ్మెంట్ కావడం వల్ల మెట్రో బ్రాండ్స్ ఐపీఓ మీద కొంత ఆసక్తి ఏర్పడింది. దేశవ్యాప్తంగా మెట్రో బ్రాండ్స్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్సుల వంటి ప్రదేశాల్లో బ్రాండింగ్ ప్రమోషన్స్, అవుట్‌లెట్స్‌ను నెలకొల్పిందీ కంపెనీ.

మెట్రో బ్రాండ్స్ ఇవే..

మెట్రో బ్రాండ్స్ ఇవే..

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ప్రమోటర్‌గా ఉన్న ఈ కంపెనీ ఇది. మెట్రో, మోచి, వాక్‌వే, క్రాక్స్, డా విన్చీ, జె ఫొంటిని బ్రాండ్స్‌కు చెందిన పాదరక్షలను ప్రమోట్ చేస్తుందీ సంస్థ. దేశంలో మూడో అత్యధిక ఎక్స్‌క్లూజివ్ రిటైల్ అవుట్ లెట్స్ ఉన్నాయి దీనికి. 136 నగరాల్లో 598 స్టోర్లను ఏర్పాటు చేసింది. ఎంవీ షూ కేర్‌ ప్రైవేట్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 83.99 శాతం స్టేక్స్ ఉన్నాయి ఇందులో.

10వ తేదీన ఓపెన్..

10వ తేదీన ఓపెన్..

మెట్రో బ్రాండ్స్ ఐపీఓ ఈ నెల 10వ తేదీన ప్రారంభమౌతుంది. 14వ తేదీన ముగుస్తుంది. 22వ తేదీన స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్టింగ్ అవుతుంది. దీని ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ ఇంకా వెల్లడి కాలేదు. వచ్చేవారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డులో దాఖలు చేసిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. 295 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఓను జారీ చేయడం ద్వారా సమీకరించిన మొత్తంలో దేశవ్యాప్తంగా తన ఎక్స్‌క్లూజివ్ అవుట్ లెట్స్‌ సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించింది.

English summary

Metro Brands IPO: మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా | IPO of Rakesh Jhunjhunwala backed Metro Brands will open on December 10

Ace investor Rakesh Jhunjhunwala-backed Metro Brands has decided to open its maiden public offer for subscription on December 10. The price band and lot size will be announced by the company next week.
Story first published: Saturday, December 4, 2021, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X