For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ భారీ పతనం, గంటల్లోనే రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

|

స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 12) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి సెన్సెక్స్ అంతకంతకూ పతనమైంది. ఉదయం 48,956.65 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 48,956.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,779.71 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,644.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,652.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,283.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి సూచి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సోమవారం వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. మరోవైపు కరోనా కేసులు భారీగా పెరగటం, వివిధ నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో వ్యాపారాలపై మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయాలు మార్కెట్లను వెంటాడాయి.

20 ఏళ్ళలో 'డబుల్' బొనాంజా: రోజుకు రూ.95 ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షలు20 ఏళ్ళలో 'డబుల్' బొనాంజా: రోజుకు రూ.95 ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షలు

భారీగా పతనం

భారీగా పతనం

క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 49,591 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ఓ సమయంలో 47,779 పాయింట్ల వరకు కూడా పతనమైంది. అంటే దాదాపు 1800 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ క్రితం సెషన్‌లో 14,834 పాయింట్ల వద్ద ముగియగా, నేడు 14,283 పాయింట్లకు కూడా పడిపోయింది. అంటే దాదాపు 600 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్, నిఫ్టీ 3.5 శాతం నుండి 4 శాతం మేర క్షీణించాయి.

రూ.7 లక్షల కోట్లు డౌన్

రూ.7 లక్షల కోట్లు డౌన్

సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనంం కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పడిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,86,708.74 కోట్లు క్షీణించి రూ.2,02,76,533.13 కోట్లకు పడిపోయింది. భారీగా పతనమైన స్టాక్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు ఉంది. 30 షేర్ కంపెనీ ప్యాక్ 7 శాతం పడిపోయింది. ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకులు కూడా పతనమయ్యాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా 3.54 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.17 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.91 శాతం, బ్రిటానియా 0.48 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 8.82 శాతం, అదానీ పోర్ట్స్ 8.39 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 8.18 శాతం, బజాజ్ ఫైనాన్స్ 7.18 శాతం, ఎస్బీఐ 6.77 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, సిప్లా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

English summary

సెన్సెక్స్ భారీ పతనం, గంటల్లోనే రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి | Investors wealth tumbles over Rs 6.86 lakh crore in morning trade as markets crack

Investors’ wealth tumbled by Rs 6,86,708.74 crore in morning trade on Monday following massive losses in the equity market as sentiments remained muted amid increasing COVID-19 cases in the country. The 30-share BSE benchmark index plunged 1,479.15 points to 48,112.17 in morning trade.
Story first published: Monday, April 12, 2021, 14:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X