For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Job loss policy: ఈ పాలసీ ఉంటే ఉద్యోగం పోయినా ఇబ్బంది లేదు.. కానీ.. ??

|

Job loss policy: ప్రస్తుతం ఎక్కడ చూసినా లే ఆఫ్ ల హవా నడుస్తోంది. చిన్న కంపెనీలు, స్టార్టప్‌ ల నుంచి అమెజాన్, మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల వరకు అన్నీ ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మీటింగ్ అంటూ పిలిచి చావు కబురు చల్లగా చెప్పడమూ చూస్తున్నాం. అకస్మాత్తుగా జరిగుతున్న ఈ పరిణామాలకు నివ్వెర పోవడం ఉద్యోగి వంతవుతోంది. ఆర్థిక అవసరాలను ఏ విధంగా తీర్చుకోవాలో తెలియక సతమతమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అంత మంచిది కాదు:

అంత మంచిది కాదు:

ఉద్యోగాల కోతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సంస్థలు జాబ్‌ లాస్ ఇన్సూరెన్స్‌ ను సైతం అందిస్తున్నాయి. నెల నెలా వస్తున్న జీతం.. లే ఆఫ్ వల్ల ఒక్కసారిగా ఆగిపోతే ఏర్పడే ఆర్థిక ఇబ్బందులకు ఇదొక చక్కటి పరిష్కారమని చెబుతున్నాయి. గృహ, ఆటో రుణం ఉంటే.. మరో ఉద్యోగం సాధించే లోపు సమర్థవంతంగా మేనేజ్ చేయవచ్చని అనేక మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ తరహా ఇన్సూరెన్స్ అంత మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 కంపెనీ తొలగిస్తేనే కవరేజి:

కంపెనీ తొలగిస్తేనే కవరేజి:

నిబంధనల ప్రకారం పనిచేస్తున్న సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగిస్తేనే ఉద్యోగి బీమా క్లైమ్ చేయవచ్చు. కానీ వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తాయి కానీ తొలగించే పరిస్థితులు చాలా తక్కువ. స్వచ్ఛందంగా ఉద్యోగం మానేయలేదని నిరూపించుకోవడం చాలా కష్టం. కాబట్టి బీమా సొమ్ము పొందే అవకాశం ఉండదు.

 సరైన ప్రణాళిక అవసరం:

సరైన ప్రణాళిక అవసరం:

రుణం తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. ఉద్యోగంలో ఉన్నప్పుడే తిరిగి చెల్లించడానికి సరైన విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం మూడు నెలల ఈఎంఐను ముందుగా సమీకరించి ఉంచుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందీ తలెత్తదని చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఈ ధనాన్ని ఇతర అవసరాలకు సైతం వినియోగించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

English summary

Job loss policy: ఈ పాలసీ ఉంటే ఉద్యోగం పోయినా ఇబ్బంది లేదు.. కానీ.. ?? | Insurance to survive while job loss

Job loss insurance policy for employees effected with lay offs
Story first published: Sunday, January 22, 2023, 11:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X