For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్ కొత్త రూటు... ఇండియాలో సక్సెస్. మరి అమెరికాలో?

|

ఇన్ఫోసిస్ టెక్నాలజీస్. ఇండియాలో రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సేవల ఎగుమతి సంస్థ. ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారు ఒక్కసారైనా ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేయాలనుకుంటారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీకి ప్రధాన ఆదాయ మార్కెట్ అమెరికా. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ 82,000 కోట్లలో సింహ భాగం అమెరికా మార్కెట్ నుంచే సమకూరుతుంది. సుమారు మూడింట ఒక వంతు వాటా ఆ దేశానిదే. అందుకే, ఒక్క ఇన్ఫోసిస్ కు మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ ఐటీ కంపెనీలకు అమెరికా కల్పతరువు. కానీ డోనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఐన తర్వాత మన కంపెనీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అలవికాని నిబంధనలతో విదేశి కంపెనీలను ట్రంప్ ఇరకాటంలో పెడుతున్నారు. అయినా కూడా ఆ మార్కెట్ కు ఉన్న సత్తా వల్ల .. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తప్పనిసరిగా అమెరికాలో కార్యకలాపాలు కొనసాగించాల్సిందే.

అందుకే, ఇన్ఫోసిస్ సహా ఇతర కంపెనీలు అక్కడ నుంచి కదలటం లేదు. ఈ నేపథ్యంలో మన ఐటీ కంపెనీలకు వ్యయాలు పెరిగిపోతున్నాయి. మరో వైపు తప్పనిసరిగా అమెరికా లోకల్స్ (స్థానికులు)కు జాబ్స్ ఇవ్వాలని ట్రంప్ నిబంధన పెట్టారు. అందులోనూ కోటా విధించారు. అమెరికన్ల కు ఉద్యోగాలు ఇవ్వాలంటే అక్కడి నిబంధనల ప్రకారం అధిక వేతనాలు చెల్లించాలి. ఒక భారతీయుడికి ఇచ్చే వేతనంతో పోల్చితే కనీసం రెండు మూడు రెట్లు అధిక వేతనం అమెరికన్లకు చెల్లించాలి. ఇదే ఇప్పుడు ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు తలనొప్పిగా మారింది.

ఇల్లు కొంటున్నారా? కాస్త ఆగండి.. బడ్జెట్‌లో రాయితీలు?ఇల్లు కొంటున్నారా? కాస్త ఆగండి.. బడ్జెట్‌లో రాయితీలు?

క్యాంపస్ హైరింగ్ ...

క్యాంపస్ హైరింగ్ ...

ఖర్చులు తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా పరిష్కారాల దిశగా అడుగులు వేయాల్సిందే. ఇండియాలో విజయవంతమైన క్యాంపస్ హైరింగ్ విధానాన్నే ఇప్పుడు ఇన్ఫోసిస్ అమెరికాలోనూ అమలు చేస్తోంది. ఈ విషయాన్ని ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో వెల్లడించింది. క్యాంపస్ హైరింగ్ తో ఖర్చులు తగ్గటమే కాకుండా... కంపెనీల్లోకి యువత అధికంగా వస్తారు. వారి సృజనాత్మకత కంపెనీ వృద్ధి కి కూడా దోహదపడుతుంది. అదే సమయంలో ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి కంపెనీ ప్రాజెక్టులపై పనిచేయించవచ్చు. ఒక ఎక్స్‌పీరియన్స్ ఎంప్లాయ్ తో పోల్చితే... కనీసం 50% తక్కువ ఖర్చుతో ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోవచ్చు. అది కూడా అప్రెంటిస్ షిప్ విధానంలో తీసుకుంటే ఖర్చులు ఇంకా తగ్గుతాయి.

10,000 మందికి పైగా....

10,000 మందికి పైగా....

డోనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతి ఇండియన్ ఐటీ కంపెనీ తన కార్యకలాపాల స్థాయిని బట్టి అమెరికా లో ఇంత మంది స్థానికులకు (అమెరికన్ సిటిజెన్) ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. అలా ఇన్ఫోసిస్ సుమారు 10,000 మంది అమెరికన్ల కు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. 2017 లో మొదలైన ఈ నిబంధనకు అనుగుణంగా ఇప్పటికే ఇన్ఫోసిస్ 10,000 కు పైగా స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేసింది. ఇందులో చాలా మంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. కానీ ఇకపై రిక్రూట్ చేసే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఫ్రెషర్స్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అమెరికా ఎలాగూ హెచ్ 1 బీ వీసాల సంఖ్యను తగ్గించేస్తోంది. ఎల్ 1 వీసాల జారీ కూడా ఆచితూచి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ కు క్యాంపస్ హైరింగ్ వరంలా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇన్ఫోసిస్ కు ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా 2,43,000 మంది ఉద్యోగులున్నారు. అట్రిషన్ రేటు దాదాపు 20% నికి దగ్గరగా ఉంటోంది. క్యాంపస్ హైరింగ్ తో దీనిని తగ్గించాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది.

పెరిగిన వ్యయాలు...

పెరిగిన వ్యయాలు...

అమెరికా లో ఉద్యోగులను సరఫరా చేసేందుకు ఒక వ్యవస్థ ఉంది. దానిని సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థగా పేర్కొంటారు. కంపెనీ అవసరాలను బట్టి ఎంత మంది ఉద్యోగులు కావాలో, వారి అనుభవం ఎంత ఉండాలో సబ్ కాంట్రాక్టర్ కు చెబితే... వారే అంత మంది ఉద్యోగులను కంపెనీకి సమకూరుస్తారు. కానీ ఈ విధానంలో అటు ఉద్యోగులకు అధిక వేతనాలు ఇవ్వాల్సి ఉండటంతో పాటు, ఇటు సబ్ కాంట్రాక్టర్ ఫీజులు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల ఈ వ్యయాలు సుమారు 40% వరకు పెరిగాయని సమాచారం. ఒక్క ఇన్ఫోసిస్ ఇందుకోసం దాదాపు రూ 6,000 కోట్ల కు పైగా ఖర్చు చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికి చెక్ పెట్టాలంటే కూడా క్యాంపస్ హైరింగ్ ఒక చక్కటి మార్గంగా కనిపిస్తోంది. అందుకే, ఇన్ఫోసిస్ స్థానిక కాలేజీ లతో ఈ మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ను కొలువులోకి తీసుకుంటోంది.

English summary

ఇన్ఫోసిస్ కొత్త రూటు... ఇండియాలో సక్సెస్. మరి అమెరికాలో? | Infy mirrors India plan: Eyes more campus recruits in US

Infosys has been strengthening its base of college graduates in the US over the past two years, leveraging strong university connects. The idea is to mirror the strategy in India, where IT services companies have a broad base of young employees, a base that is built through campus hiring.
Story first published: Friday, January 24, 2020, 20:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X