For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీసీఎస్, యాక్సెంచర్ పోటీపడ్డప్పటికీ.. ఇన్ఫోసిస్ చరిత్రలో అతిపెద్ద, అరుదైన డీల్

|

దేశీయ సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్.. అమెరికా ఫండింగ్ ఏజెన్సీ వాన్‌గార్డ్ నుండి భారీ కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో భారీ డీల్ కుదరడం గమనార్హం. ఈ డీల్ వ్యాల్యూ 1.5 బిలియన్ డాలర్లు లేదా రూ.11,500 కోట్లు. పదేళ్లకాలం వరకు సర్వీసులు పొడిగించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు ఈ డీల్ 2 బిలియన్ డాలర్ల వ్యాల్యూకు చేరుతుందని అంచనా.

3 కంపెనీలు రూ.1 లక్ష కోట్లు ప్లస్, 7 కంపెనీలు రూ.37వేల కోట్లు లాస్3 కంపెనీలు రూ.1 లక్ష కోట్లు ప్లస్, 7 కంపెనీలు రూ.37వేల కోట్లు లాస్

ఇన్ఫీ చరిత్రలో అతిపెద్ద డీల్

ఇన్ఫీ చరిత్రలో అతిపెద్ద డీల్

ఇన్ఫోసిస్ ఇటీవల 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ ఫలితాలు విడుదల చేసింది. ఈ క్వార్టర్‌లో 1.7 బిలియన్ డాలర్ల డీల్స్ కుదిరినట్లు తెలిపింది. అయితే ఈ డీల్స్‌లో వాన్‌గార్డ్ లేదని విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఆ లెక్కన ఇది అదనపు డీల్. ఇన్ఫోసిస్ చేసుకున్న ఒప్పందాల్లో ఇప్పటి వరకు ఇది అతి పెద్దదిగా చెబుతున్నారు. అంతకుముందు ఈ డీల్ వ్యాల్యూ బిలియన్ డాలర్ల లోపుగా అంచనా వేశారు. గత వారం షేర్ దూకుడుకు ఈ డీల్ పైన అంచనాలు కొంత కారణమైనట్లుగా చెబుతున్నారు. కంపెనీ దీనిపై స్పందించాల్సి ఉంది.

టీసీఎస్, యాక్సెంచర్, విప్రోలు పోటీ పడ్డప్పటికీ..

టీసీఎస్, యాక్సెంచర్, విప్రోలు పోటీ పడ్డప్పటికీ..

తొలి క్వార్టర్ ఫలితాల తర్వాత, డీల్స్ తెలిశాక ఇన్ఫీ షేర్లు గతవారం భారీగా పుంజుకున్నాయి. ఇప్పుడు ఈ భారీ డీల్ వెలుగు చూడటం గమనార్హం. వాన్‌గార్డ్ డీల్ కోసం ఇన్ఫోసిస్‌తో పాటు మిగతా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, యాక్సెంచర్, విప్రోలు పోటీ పడ్డాయని తెలుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా బీపీఎం సర్వీసుతో పాటు డిజిటల్ ట్రాన్స్‌పార్మేషన్ సేవల్ని ఇన్ఫోసిస్ అందించనున్నట్లు చెబుతున్నారు. వాన్‌గార్డ్ క్లౌడ్ ప్లాట్‌ఫాం ద్వారా నిర్వహించే రికార్డ్ కీపింగ్ సర్వీసులకు మద్దతివ్వనున్నట్లు చెబుతున్నారు.

1 బిలియన్ డాలర్ల డీల్ అరుదు..

1 బిలియన్ డాలర్ల డీల్ అరుదు..

ఇండియన్ ఐటీ కంపెనీలకు 1 బిలియన్ డాలర్ల డీల్స్ అరుదు అని చెబుతున్నారు. ఇన్ఫోసిస్‌కు గతంలో వెరిజోన్ డీల్ గత ఏడాది నాటికి 1 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెబుతున్నారు. ఈ వాన్‌గార్డ్ డీల్‌కు సంబంధించి సేవల కోసం ఇన్ఫోసిస్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో 3,000 సీట్ల సామర్థ్యంతో సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రారంభంలో 300 నుండి 400 మంది ఉద్యోగులు ఉంటారు. ఆ తర్వాత క్రమంగా డీల్‌కు అనుగుణంగా పెంచుతారు.

షేర్ జూమ్

షేర్ జూమ్

వివిధ ఫండ్స్ ద్వారా ఇన్ఫోసిస్‌లో 3% వాటాను వాన్‌గార్డ్ కలిగి ఉంది. రిటైర్మెంట్ సర్వీసుల విభాగంలో ఇన్ఫోసిస్‌కు మంచి పట్టు ఉంది. అమెరికాలో ఇలాంటి టాప్ 20 కంపెనీలలో సగం వరకు సేవల్ని అందిస్తోంది. ప్రాథమిక ఒప్పంద ప్రాస్పెక్టింగ్స్ 12 నెలల కాలంలో ప్రారంభమవుతాయి. ఇన్ఫోసిస్ షేర్ ధర ఈ రోజు మరింతగా పుంజుకుంది. 1.20 శాతం ఎగిసి రూ.914కు చేరుకుంది. ఓ దశలో రెండు శాతం ఎగిసి రూ.924 ట్రేడ్ అయింది. గత గురువారం రూ.955ను అధిగమించడం ద్వారా ఇన్ఫీ షేర్ 52 వారాల గరిష్టానికి చేరుకుంది.

English summary

టీసీఎస్, యాక్సెంచర్ పోటీపడ్డప్పటికీ.. ఇన్ఫోసిస్ చరిత్రలో అతిపెద్ద, అరుదైన డీల్ | Infosys Vanguard deal value pegged at $1.5 billion

The multi year deal Infosys gained from US funding agency Vanguard is price $1.5 billion, say sources near the event. It will maybe make it the most important deal Infosys has ever signed. Beforehand, some believed it was slightly below a billion.
Story first published: Monday, July 20, 2020, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X