For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ నిరాశపరిచిన పారిశ్రామికోత్పత్తి, ఆ రంగం మినహా అన్నీ మైనస్

|

భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్-IIP) జూన్ 2020లో భారీగా క్షీణించింది. తయారీ, గనులు, విద్యుత్ ఉత్పత్తి రంగాలు తీవ్ర నిరాశను మిగిల్చడంతో ఏకంగా 16.6% శాతం పడిపోయింది. ఈ మేరకు మంగళవారం సంబంధిత మంత్రిత్వ శాఖ గణాంకాలు విడుదల చేసింది. తయారీరంగంలో 17.1%, గనుల రంగంలో 19.8%, విద్యుత్‌ రంగంలో 10% క్షీణత నమోదయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కంటే ముందు గణాంకాలతో ఇప్పటి గణాంకాలను పోల్చడం సమంజసం కాదని కూడా పేర్కొంది. అయితే గత జూన్ నెలతో పోలిస్తే మాత్రం 1.3% పెరిగింది.

ఉద్యోగాలు పెరుగుతున్నా ఆర్థిక వ్యవస్థ కోలుకోదు.. ఎందుకంటే! కీలకమైన ఆ జాబ్స్ ఆందోళనకరంగా..ఉద్యోగాలు పెరుగుతున్నా ఆర్థిక వ్యవస్థ కోలుకోదు.. ఎందుకంటే! కీలకమైన ఆ జాబ్స్ ఆందోళనకరంగా..

నెలవారీగా మెరుగు

నెలవారీగా మెరుగు

ఏప్రిల్ నెలలో 53.6 శాతం, మే నెలలో 89.5 శాతం, జూన్ నెలలో 107.8కు సూచీ పెరిగింది. నెలవారీగా చూస్తే పారిశ్రామికోత్పత్తి కొంత మెరుగుపడింది. ఈ ఏడాది జూన్ నెలలో మన్నికైన వినిమయ వస్తువులు (రిఫ్రిజిరేటర్లు, స్పోర్ట్స్ ఐటమ్స్, బొమ్మలు వంటి), భారీ యంత్ర పరికరాలకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో... వరుసగా 35.5%, 36.9% చొప్పున ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. వినిమయేతర వస్తువుల విభాగం 14% పెరిగింది. ఏప్రిల్-జూన్ మధ్య పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు మైనస్ 35.9%గా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 3% వృద్ధిని సాధించింది.

60 శాతంగా ఉన్న తయారీ రంగం..

60 శాతంగా ఉన్న తయారీ రంగం..

మొత్తం సూచీలో దాదాపు 60%గా ఉన్న తయారీరంగంలో ఉత్పత్తి ఏకంగా 17.1% క్షీణతని నమోదుచేసింది. గనుల రంగంలో మైనస్ 19.8%, ఇక విద్యుత్ ఉత్పత్తి మైనస్ 10% క్షీణించింది. కరోనా నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి జూన్ వరకు 80 రోజుల వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పారిశ్రామికోత్పత్తి భారీగా పడిపోయింది. జూన్ నుండి అన్-లాక్ ప్రారంభమైంది. జూలైలో పారిశ్రామికోత్పత్తి కోలుకునే అవకాశముంది.

ఎరువుల రంగం మినహా.. అన్ని మైనస్‌లలో

ఎరువుల రంగం మినహా.. అన్ని మైనస్‌లలో

మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 40%గా వెయిటేజ్ ఉన్న 8 మౌలిక పరిశ్రమల గ్రూప్ గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ జూన్‌లో అసలు వృద్ధిలేదు. పైగా మైనస్ 15% క్షీణించింది. ఎనిమిది రంగాల్లో ఏడు బొగ్గు (మైనస్ 15.5%), క్రూడ్ ఆయిల్ (మైనస్ 6%), సహజ వాయువు (మైనస్ 12%), రిఫైనరీ ఉత్పత్తులు (మైనస్ 8.9%), స్టీల్ (మైనస్ 33.8%), సిమెంట్ (మైనస్ 6.9%), విద్యుత్ (మైనస్ 11%) ఉత్పత్తి క్షీణరేటును నమోదు చేశాయి. ఒక్క ఎరువులరంగం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది.

English summary

మళ్లీ నిరాశపరిచిన పారిశ్రామికోత్పత్తి, ఆ రంగం మినహా అన్నీ మైనస్ | Industrial production declines 16.6 percent in June

India’s industrial output contracted 16.6% in June from a year earlier, government data showed on Tuesday, as a monthly measure indicated some recovery in the sector that was hit by lockdowns imposed to curb the spread of coronavirus.
Story first published: Wednesday, August 12, 2020, 8:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X