కుమ్మేసిన ఇండస్ఇండ్ బ్యాంక్
ముంబై: దేశంలో మూడో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా గుర్తింపు పొందిన ఇండస్ఇండ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి కిందటే వెల్లడించింది. అంచనాలకు మించి రాణించింది. మంచి లాభాలను ఆర్జించింది. 50 శాతం మేర వృద్ధిరేటును నమోదు చేసుకుంది. 49.49 శాతం నికర లాభాలను అందుకోగలిగింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ మధ్యాహ్నం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించింది. మహారాష్ట్రలోని పుణె ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను సాగిస్తోన్న బ్యాంక్ ఇది.
BoAt IPO: రూ.వేల కోట్ల సమీకరణ: సెబికి ప్రపోజల్స్
అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్యకాలానికి 1,241.39 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్‌ను అందుకుంది ఇండస్ఇండ్ బ్యాంక్. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే మూడో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్ నికర ఆదాయం 830.39 కోట్ల రూపాయలు. కాగా- దీన్ని 1,241 కోట్లకు చేర్చింది. ఈ మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం 9,614.34 కోట్ల రూపాయలుగా చూపించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎనిమిది శాతం పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఈ ఆదాయం 8,887.28 కోట్ల రూపాయలు.

బేసెల్ 3 కేపిటల్ అడెక్వసీ శాతం 18.06గా నమోదైంది. ఇది రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బేసెల్ 3 కేపిటల్ అడెక్వసీ రేషియో 17.37 శాతం. వేర్వేరు రూపాల్లో ఇచ్చిన రుణాలపై విధించిన వడ్డీల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ 7,737.49 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ మొత్తం 7,241.50 కోట్ల రూపాయలు. నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కమ్‌లో స్వల్పంగా క్షీణత కనిపించింది.
మూడో త్రైమాసికంలో సాధించిన నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ 3,793.57 కోట్ల రూపాయలు కాగా, ఇదే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ మొత్తం 3,991.96 కోట్ల రూపాయలుగా రికార్డయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ మొత్తం 3,943.92 కోట్ల రూపాయలుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తుల శాతం బాగా పెరిగింది. 2.48 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం థర్డ్ క్వార్టర్‌లో ఈ సంఖ్య 1.74 శాతమే. నికర నిరర్థక ఆస్తుల విషయంలోనూ పెరుగుదల కనిపించింది. 0.22 నుంచి 0.71 శాతానికి పెరిగింది.
గత ఏడాది క్యు3లో ఇది 1.74శాతం మాత్రమే ఈ ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా బ్యాంక్ కోవిడ్ 19 థర్డ్ వేవ్ తమ ప్రొవిజన్లను ప్రభావితం చేసిందని చెప్తోంది.వాస్తవానికి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గడచిన 2 నెలల్లో లాక్‌డౌన్ పెట్టిందే లేదు. అయినా బ్యాంక్ ఇలా చెప్పుకురావడం గమనార్హం. డిసెంబర్ 31 నాటికి తమ బ్యాంక్ ప్రొవిజన్లు రూ.3740 కోట్లుగా ప్రకటించింది. వీటిలో అప్పులు తీసుకున్నవారి అక్కౌంట్లలో రీ స్ట్రక్చరింగ్ కి సంబంధించి రూ.1365కోట్లు ఉన్నట్లు చెప్పింది.