For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిబ్రవరి తర్వాత మొదటిసారి, పెట్రోలియం ఉత్పత్తులు జంప్: పుంజుకోని జెట్ ఇంధన డిమాండ్

|

మార్చి చివరి వారం నుండి లాక్‌డౌన్ విధించడంతో పడిపోయిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్, అన్-లాక్ తర్వాత క్రమంగా మెరుగుపడుతోంది. క్రమంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల డిమాండ్ కరోనా మహమ్మారి ముందుస్థాయికి చేరుకుంటున్నాయి. అన్‌లాక్ తర్వాత డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. లాక్ డౌన్ సమయంలో ప్రజా రవాణా లేకపోవడంతో వాహనాల రాకపోకలు లేక డిమాండ్ కనిష్టానికి పడిపోయింది.

ఏప్రిల్ నెలలో చమురు డిమాండ్ సగం క్షీణించింది. మే నుండి అన్-లాక్ ప్రారంభమయ్యాక ఇంధనానికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. నెలనెలా డిమాండ్ పెరిగినప్పటికీ, ఏడాది ప్రాతిపదికన (2019లో అదే నెలతో చూస్తే) మాత్రం తగ్గుదలను నమోదు చేసింది.

కంపెనీలకు పీఎఫ్ గుడ్‌న్యూస్.. రెండేళ్లపాటు ఈపీఎఫ్‌ను మోడీ ప్రభుత్వమే ఇస్తుంది.. వివరాలివీ...కంపెనీలకు పీఎఫ్ గుడ్‌న్యూస్.. రెండేళ్లపాటు ఈపీఎఫ్‌ను మోడీ ప్రభుత్వమే ఇస్తుంది.. వివరాలివీ...

ఫిబ్రవరి తర్వాత మళ్లీ అక్టోబర్‌లో...

ఫిబ్రవరి తర్వాత మళ్లీ అక్టోబర్‌లో...

దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్ నెలలో ఇంధన డిమాండ్ 2.7 శాతం జంప్ చేసి 17.8 మిలియన్ టన్నులుగా ఉంది. 2019లో ఇదే నెలలో 17.34 మిలియన్ టన్నుల ఇంధన వినియోగం ఉంది. కరోనా సంక్షోభం తర్వాత ఒక నెలలో ఏడాది ప్రాతిపదికన వృద్ధి నమోదు చేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఫిబ్రవరిలో నమోదు చేసింది. ఫిబ్రవరి తర్వాత ఏడు నెలల అనంతరం అంతకుముందు సంవత్సరంతో వృద్ధిని నమోదు చేసింది.

అందుకే డిమాండ్ జంప్

అందుకే డిమాండ్ జంప్

పండుగ సీజన్ కావడంతో, ప్రజా సరుకు రవాణా వాహనాల రాకపోకలు పెరిగి, డీజిల్ వినియోగం కరోనా ముందుస్థాయికి చేరుకుంది. అలాగే వ్యక్తిగత రవాణా వల్ల పెట్రోల్ వినియోగం పెరిగి సెప్టెంబర్ నెలలోనే కరోనా ముందుస్థాయికి చేరుకుంది. అక్టోబర్‌లో రెండూ ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైతే పెట్రోల్, డీజిల్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

పరిశ్రమల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా, పెట్రో రసాయనాల తయారీకి వినియోగిస్తున్న నాఫ్తాకు డిమాండ్ 15 శాతం, రోడ్ల నిర్మాణాల్లో వాడే తారు వినియోగం 48 శాతం వృద్ధిని నమోదు చేసింది. వంట గ్యాస్ వినియోగం లాక్ డౌన్ సమయంలోను తగ్గలేదు. అక్టోబర్ నెలలో 2.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. విమానయాన సంస్థలు పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించలేదు. దీంతో జెట్ ఇంధన డిమాండ్ ఇంకా సగమే ఉంది.

కార్యకలాపాలు 85 శాతానికి

కార్యకలాపాలు 85 శాతానికి

జూలై-సెప్టెంబర్ కాలంలో పలు చమురు కంపెనీల కార్యకలాపాలు సగం వరకు నిలిచిపోయాయి. అక్టోబర్ నెలలో ఈ కార్యకలాపాలు 85శాతానికి చేరుకున్నాయి. గ్లోబల్ చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర గత శుక్రవారం స్వల్పంగా పడిపోయి బ్యారెల్ 43 మిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే గత వారంలో మొత్తంగా 8 శాతం పెరిగింది.

English summary

ఫిబ్రవరి తర్వాత మొదటిసారి, పెట్రోలియం ఉత్పత్తులు జంప్: పుంజుకోని జెట్ ఇంధన డిమాండ్ | India's petrol, diesel demand posts first growth since February

India reported its first yearly increase in petroleum consumption since February, proving the fuel-guzzling nation’s demand is back despite rising coronavirus cases.
Story first published: Sunday, November 15, 2020, 14:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X