For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారివి పెరుగుతుంటే... స్విస్ బ్యాంకులో 6% తగ్గిన భారతీయుల సొమ్ము

|

నరేంద్ర మోడీ ప్రభుత్వం స్విస్ బ్యాంకు అకౌంట్లలోని ఇండియన్స్ మనీ కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొందరి పేర్లు ఇండియాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద క్రమంగా తగ్గుతోంది. ఓ వైపు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో విదేశీ సొమ్ము పెరుగుతుంటే, మన సంపద మాత్రం తరుగుతుండటం గమనార్హం. ఇందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు కారణం కావొచ్చు. అంతకుముందు ఏడాది కంటే 2019లో 6 శాతం మేర తగ్గాయి.

<strong>boycott china: చైనీయులకు గదులివ్వం, భోజనం పెట్టం.. హోటల్స్&రెస్టారెంట్స్</strong>boycott china: చైనీయులకు గదులివ్వం, భోజనం పెట్టం.. హోటల్స్&రెస్టారెంట్స్

74వ స్థానం నుండి 77వ స్థానానికి..

74వ స్థానం నుండి 77వ స్థానానికి..

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము అంతకుముందు ఏటికేడు పెరిగేది. ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. దీంతో అంతకుముందు ఏడాది 74 స్థానంలో ఉన్న భారత్, 2019లో 77వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు స్విస్ బ్యాంకు మొత్తం నిధుల్లో భారత్ వాటా కేవలం 0.06 శాతానికి (ఫారన్ ఫండ్స్) పడిపోయింది. భారత్ ఫండ్స్ వరుసగా రెండో ఏడాది తగ్గిపోయాయి. ఈసారి 55 స్విస్ ఫ్రాన్స్ లేదా 5.8 శాతం తగ్గింది. 899 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ లేదా రూ.6,625 కోట్లకు చేరాయి. మూడు దశాబ్దాల్లో ఇది మూడో కనిష్టం.

అప్పటి నుండి వరుసగా తగ్గుదల

అప్పటి నుండి వరుసగా తగ్గుదల

స్విస్ బ్యాంకుల్లో ఇండియన్స్ మనీ 2006లో అత్యధికంగా 6.46 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ ఉంది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఇది 1.81 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ లేదా రూ.14,400 కోట్లకు తగ్గింది. విదేశాల్లోని బ్లాక్ మనీని తీసుకు వస్తామని మోడీ ప్రకటించారు. అప్పటి నుండి స్విస్ బ్యాంకుల్లో మన నిధులు తగ్గుతున్నాయి. మరోవైపు మోడీ ప్రభుత్వం నిధులు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఒప్పందాల కారణంగా ఇది ఆలస్యమవుతోంది.

భారీగా పెరిగిన విదేశీ, చైనా నిధులు

భారీగా పెరిగిన విదేశీ, చైనా నిధులు

స్విస్ బ్యాంకుల్లో భారత్ డిపాజిట్స్ తగ్గుతున్నప్పటికీ, ఇతర దేశాల నిధులు మాత్రం పెరుగుతున్నాయి. 2018లో 1.39 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్ ఉండగా, 2019కి ఇవి 3.1 శాతం పెరిగి 1.44 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏడాదిలో చైనా నుండి ఏకంగా 13.1 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది 13.5 బిలియన్ డాలర్లు ఉండగా, గత ఏడాది 15.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

టాప్ 10 దేశాల వాటా 75 శాతం

టాప్ 10 దేశాల వాటా 75 శాతం

స్విస్ బ్యాంకుల్లో అత్యధికంగా యూకే రెసిడెంట్స్ నిధులు ఉన్నాయి. 2019లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న మొత్తంలో 27 శాతం యూకేకు చెందినది. యూకే తర్వాత యూఎస్, వెస్టిండీస్, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్ ఉన్నాయి. టాప్ 5 దేశాల సంపదే స్విస్ బ్యాంకుల్లో 50 శాతం కాగా, టాప్ 10 దేశాల సంపద 75 శాతం ఉంటుంది. టాప్ 30 దేశాల సంపద 90 శాతంగా ఉంటుంది. టాప్ 10లో జర్మనీ, లగ్జెంబర్గ్, బహ్మాస్, సింగపూర్, కేమాన్ ఐస్‌లాండ్స్ ఉన్నాయి. చైనా, రష్యా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, పనామా, ఇటలీ, సైప్రస్, యూఏఈ, నెదర్లాండ్స్, జపాన్ సంపద ఉంది.

ఈ దేశాలు మనకంటే ముందు

ఈ దేశాలు మనకంటే ముందు

బ్రిక్స్ దేశాల్లో ఇండియా.. రష్యా కంటే తక్కువ స్థానంలో ఉంది. స్విస్ బ్యాంకులో ధనం ఉన్న జాబితాలో రష్యా 20వ స్థానంలో, చైనా 22, సౌతాఫ్రికా 56వ స్థానం, బ్రెజిల్ 62వ స్థానంలో ఉన్నాయి. ఇండియా 77వ స్థానంలో ఉంది. కెన్యా, మారిషస్, న్యూజిలాంట్, వెనిజులా, ఉక్రెయిన్, పిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, కెనడా, ఇజ్రాయెల్, టర్కీ, మెక్సికో, తైవాన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఇటలీ, యూఏఈ, నెదర్లాండ్స్, జపాన్ వంటి దేశాలు మనకంటే ముందున్నాయి. మన పక్క దేశాలు పాకిస్తాన్ 99వ స్థానం, బంగ్లాదేశ్, 85, నేపాల్ 118, శ్రీలంక 148, మయన్మార్ 186, భూటాన్ 196వ స్థానంలో ఉన్నాయి.

నల్లధనం ప్రస్తావన లేదు

నల్లధనం ప్రస్తావన లేదు

ఇవన్నీ వివిధ బ్యాంకులు తమకు తెలియజేసిన అధికారిక గణాంకాలు అని, స్విట్జర్లాండ్‌లో భారతీయులు దాచిన నల్లధనం గురించి ఈ గణాంకాల్లో ప్రస్తావించలేదని స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) తెలిపింది. ఇతర దేశాల్లోని సంస్థల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు, భారత సంస్థలు స్విస్ బ్యాంకుల్లో కూడబెట్టిన సొమ్ము వివరాలు కూడా ఈ గణాంకాల్లో లేవని తెలిపింది. వ్యక్తులు, బ్యాంకులు, సంస్థలు సహా భారత కస్టమర్ల నుంచి స్విస్ బ్యాంకుల్లోకి వచ్చిన అన్ని రకాల నిధులను గమనంలోకి తీసుకొని ఈ గణాంకాలను రూపొందించినట్టు పేర్కొంది. భారత్‌లోని స్విస్‌ బ్యాంకు శాఖల నుంచి వచ్చిన డిపాజిట్లు, నాన్ డిపాజిట్స్ వివరాలు ఈ గణాంకాల్లో ఉన్నాయి.

English summary

వారివి పెరుగుతుంటే... స్విస్ బ్యాంకులో 6% తగ్గిన భారతీయుల సొమ్ము | Indians money in Swiss Banks down 6 percent at Rs 6,625 crore in 2019

Funds parked by Indian individuals and enterprises in Swiss banks, including through India-based branches, fell nearly 6 per cent in 2019 to 899 million Swiss francs (Rs 6,625 crore), annual data from Switzerland's central bank showed on Thursday.
Story first published: Friday, June 26, 2020, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X